WhatsApp: వాట్సప్ ఛాట్స్ హైడ్ చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

WhatsApp: వాట్సప్ ఛాట్స్ హైడ్ చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp | మీరు వాట్సప్‌లో ఛాట్స్‌ని (WhatsApp Chats) కొంతకాలంపాటు కనిపించకుండా చేయాలనుకుంటున్నారా? ఇతరులు మీ వాట్సప్ చెక్ చేసినప్పుడు ఆ ఛాట్స్ కనిపించకూడదా? అయితే ఈ ఫీచర్స్ వాడుకోండి.

  • Share this:
    వాట్సప్... ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ గురించి పరిచయం అక్కర్లేదు. వాట్సప్ అంటే మొదట గుర్తొచ్చేది ఛాటింగ్. వాట్సప్ వచ్చిన కొత్తలో ఛాటింగ్‌కు బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయడం లాంటి అనేక ఫీచర్స్ (WhatsApp Features) వచ్చాయి. వాట్సప్‌లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి యూజర్లకు అవగాహన తక్కువే. అలాంటి ఫీచర్స్‌లో ఆర్కైవ్ ఫీచర్ (Whatsapp Archive Feature) ఒకటి. మీరు ఏదైనా వాట్సప్ ఛాట్‌ని హైడ్ చేయాలంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇటీవల వాట్సప్ ఆర్కైవ్‌లో కొత్త సెట్టింగ్స్ కూడా వచ్చాయి. యూజర్లు తమ ఛాట్స్‌ని హైడ్ చేయడానికి, అవసరం అయినప్పుడు చూడటానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మరి వాట్సప్‌లో ఛాట్స్‌ని ఎలా హైడ్ చేయాలో తెలుసుకోండి.

    Vivo Y3s: వివో నుంచి రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

    వాట్సప్‌లో ఛాట్స్‌ని ఆర్కైవ్ చేయండి ఇలా


    ముందుగా వాట్సప్‌లో ఛాట్స్ ఓపెన్ చేయండి. మీరు ఆర్కైవ్ చేయాలనుకునే ఛాట్ సెలెక్ట్ చేయండి. మీకు పైన పిన్, మ్యూట్, డిలిట్, ఆర్కైవ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో కిందివైపు బాణం గుర్తుతో ఉన్న ఐకాన్‌ను క్లిక్ చేస్తే ఛాట్ ఆర్కైవ్ అవుతుంది. వాట్సప్‌లో త్రీడాట్స్ క్లిక్ చేస్తే Archived సెక్షన్‌లో మీరు ఆర్కైవ్ చేసిన ఛాట్స్ కనిపిస్తాయి.

    వాట్సప్‌లో ఛాట్స్‌ని అన్ఆర్కైవ్ చేయండి ఇలా


    వాట్సప్‌లో ఛాట్స్‌ని ఆర్కైవ్ చేయడం మాత్రమే కాదు... అన్ఆర్కైవ్ కూడా చేయొచ్చు. ఇందుకోసం వాట్సప్ ఓపెన్ చేయాలి. స్క్రీన్‌లో టాప్‌లో Archived సింబల్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే మీరు ఆర్కైవ్ చేసిన ఛాట్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు అన్ఆర్కైవ్ చేయాలనుకునే ఛాట్ సెలెక్ట్ చేసి పైన కనిపించే అన్ఆర్కైవ్ సింబల్ క్లిక్ చేయాలి. మళ్లీ ఆ ఛాట్స్ కనిపిస్తాయి.

    WhatsApp New Feature: వాట్సప్‌లో గ్రూప్ కాల్స్‌లో కొత్త ఫీచర్... మీరూ వాడుకోండి ఇలా

    వాట్సప్‌లో ఛాట్స్‌ని ఆర్కైవ్ చేయడం అంటే ఆ ఛాట్స్‌ని డిలిట్ చేయడం కాదు. ఆ ఛాట్స్ బ్యాకప్‌లో లేదా మీ ఎస్‌డీ కార్డు నుంచి డిలిట్ కావు. కేవలం మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేసినప్పుడు కనిపించవు. మీరు వాట్సప్ ఛాట్స్ మాత్రమే కాదు... వాట్సప్ గ్రూప్స్‌ని కూడా ఆర్కైవ్ చేయొచ్చు. మీరు ఆర్కైవ్ చేసిన ఛాట్స్‌కు నోటిఫికేషన్స్ కూడా రావు.

    వాట్సప్ యూజర్లు ఛాట్స్ డిలిట్ చేయడానికి, ఆర్కైవ్ చేయడానికి ఉన్న తేడా తెలుసుకోవాలి. ఒకవేళ మీకు ఆ ఛాట్స్ ఎప్పటికీ వద్దనుకుంటే డిలిట్ చేయాలి. మీరు వాట్సప్ ఛాట్స్ బ్యాకప్ చేస్తే డిలిట్ చేసిన ఛాట్స్ బ్యాకప్‌లోకి వెళ్లవు. మీరు మళ్లీ రీస్టోర్ చేసినప్పుడు కూడా ఆ ఛాట్స్ కనిపించవు.
    Published by:Santhosh Kumar S
    First published: