Google: పబ్లిక్ టాయిలెట్ ఎక్కడుంది? గూగుల్‌లో ఇలా సెర్చ్ చేస్తే తెలుస్తుంది

Public Toilets Near Me | టాయిలెట్ కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. మీకు దగ్గర్లో టాయిలెట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా సులువు. మీ ఫోన్‌లో గూగుల్ బ్రౌజ్ చేయగలిగితే చాలు.

news18-telugu
Updated: October 3, 2019, 5:34 PM IST
Google: పబ్లిక్ టాయిలెట్ ఎక్కడుంది? గూగుల్‌లో ఇలా సెర్చ్ చేస్తే తెలుస్తుంది
Google: పబ్లిక్ టాయిలెట్ ఎక్కడుంది? గూగుల్‌లో ఇలా సెర్చ్ చేస్తే తెలుస్తుంది (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 3, 2019, 5:34 PM IST
"దగ్గర్లో టాయిలెట్ ఎక్కడుంది?" ఈ ప్రశ్న ప్రతీ ఒక్కరూ ఎవర్నో ఒకర్ని ఎప్పుడో ఒకప్పుడు అడిగే ఉంటారు. ఇల్లు దాటి బయటకు వచ్చారంటే దారిలో పనికానిచ్చుకోవడానికి పబ్లిక్ టాయిలెట్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి అందరికీ అనుభవమే. సులభ్ కాంప్లెక్స్‌లు, ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే టాయిలెట్స్ ఉన్నా, అవి ఎక్కడ ఉన్నాయో తెలియక తిప్పలు పడుతుంటారు సామాన్యులు. ఇకపై అలా టాయిలెట్ కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. మీకు దగ్గర్లో టాయిలెట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా సులువు. మీ ఫోన్‌లో గూగుల్ బ్రౌజ్ చేయగలిగితే చాలు. దగ్గర్లో ఎక్కడెక్కడ టాయిలెట్స్ ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు. గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ‘public toilets near me’ అని టైప్ చేస్తే చాలు. మీకు దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ లొకేషన్‌తో సహా తెలిసిపోతాయి. ఇదే ప్రశ్న గూగుల్ అసిస్టెంట్‌ని అడిగినా అడ్రస్ వెంటనే తెలిసిపోతుంది. టాయిలెట్ కోసం ఎలా సెర్చ్ చేయాలో ఈ వీడియోలో చూడొచ్చు.

కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, స్వచ్ఛ్‌ భారత్ మిషన్‌ సహకారంతో టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ 2016లో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లను గూగుల్ మ్యాప్స్‌లో సులువుగా గుర్తించేలా చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. మొదట న్యూ ఢిల్లీ, భోపాల్, ఇండోర్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఆ తర్వాత మిగతా పట్టణాలనూ ఈ ప్రాజెక్ట్‌లో చేర్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,300 పైగా పట్టణాల్లోని 57,000 పబ్లిక్ టాయిలెట్స్‌ని గూగుల్ మ్యాప్స్‌లో లొకేట్ చేయొచ్చు. ఇప్పటికే ఈ టాయిలెట్స్‌ని లొకేట్ చేసి వాడుకుంటున్నారు లక్షలాది మంది ప్రజలు. రివ్యూలు, రేటింగ్స్ ఇవ్వడంతో పాటు ఫోటోలు కూడా అప్‌లోడ్ చేస్తున్నారు.

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

SBI Charges: ఎస్‌బీఐ ఛార్జీల్లో మార్పు... మనీ ట్రాన్స్‌ఫర్, మంత్లీ బ్యాలెన్స్ కొత్త ఛార్జీలు తెలుసుకోండి
Loading...
Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌... లాభాలేంటో తెలుసా?

IRCTC: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ టెక్నిక్‌తో రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
First published: October 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...