హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్... ఇక అన్నీ వాట్సప్‌లోనే

WhatsApp: మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్... ఇక అన్నీ వాట్సప్‌లోనే

WhatsApp: మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్... ఇక అన్నీ వాట్సప్‌లోనే
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp: మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్... ఇక అన్నీ వాట్సప్‌లోనే (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp | మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ (PAN Card), డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ ఇక వాట్సప్‌లోనే సింపుల్ స్టెప్స్‌తో డౌన్‌లోడ్ చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఒకప్పుడు ఏ ముఖ్యమైన డాక్యుమెంట్ అయినా ఫైల్‌లో వెంట తీసుకెళ్లాల్సి వచ్చేది. ఐడీ కార్డులు కూడా జేబులో పెట్టుకొని తిరగాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ని సాఫ్ట్ కాపీ రూపంలో అనుమతి ఇస్తున్నాయి. అంటే ఆ డాక్యుమెంట్‌కు డిజిటల్ రూపంలో ఉంటే చాలు. ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అది కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చే ఫార్మాట్‌లోనే ఉండాలి. ఆధార్ కార్డ్ (Aadhaar Card), పాన్ కార్డ్ (PAN Card), డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్‌ని ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకోవచ్చు.

ఈ పద్ధతి ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. వాట్సప్ ఉంటే చాలు. మీ వాట్సప్‌లోనే ఈ డాక్యుమెంట్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన మైగవ్ హెల్ప్‌డెస్క్ (MyGov Helpdesk) కొంతకాలం క్రితమే వాట్సప్ ద్వారా ముఖ్యమైన డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. ఇందుకోసం మీ దగ్గర డిజీలాకర్ అకౌంట్ ఉంటే చాలు. డిజీలాకర్‌లోని మీ డాక్యుమెంట్స్‌ని వాట్సప్ ద్వారా సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిదే చాలు.

SBI Account: మీ ఎస్‌బీఐ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయా? కారణమిదే

Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో MyGov Helpdesk నెంబర్ +91 9013151515 సేవ్ చేయాలి.

Step 2- వాట్సప్ ఓపెన్ చేసి MyGov Helpdesk నెంబర్ సెర్చ్ చేయాలి.

Step 3- ఛాట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత Hi లేదా Namaste అని మెసేజ్ పంపాలి.

Step 4- ఆ తర్వాత డిజీలాకర్ సర్వీసెస్, కోవిన్ ఆన్ వాట్సప్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి.

Step 5- డిజీలాకర్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి.

Step 6- మీ డిజీలాకర్ అకౌంట్‌కు లింక్ అయిన 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 7- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి.

Step 8- డిజీలాకర్‌లో సేవ్ అయి ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మీ ఛాట్‌బాట్‌లో కనిపిస్తాయి.

Step 9- ఇందులో మీకు కావాల్సిన డాక్యుమెంట్ లేదా ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

Railway Rules: రైలులో రాత్రి పూట ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ గుర్తుంచుకోండి

మీరు డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్ పీడీఎఫ్ రూపంలో మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ అవుతాయి. ఈ సర్వీస్ ఉపయోగించుకోవాలంటే మీకు డిజీలాకర్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి. అంతేకాదు మీ డిజీలాకర్ అకౌంట్‌లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ సేవ్ చేసి ఉండాలి. అప్పుడే వాట్సప్‌లో మీ డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేయడం సాధ్యమవుతుంది. డిజీలాకర్ అకౌంట్ లేకపోతే డిజీలాకర్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయొచ్చు.

First published:

Tags: Aadhaar Card, AADHAR, Digilocker, PAN card, Whatsapp