Home /News /technology /

WANT TO DOWNLOAD YOUR FAVOURITE YOUTUBE VIDEO ON SMARTPHONE FOLLOW THESE SIMPLE STEPS SS

YouTube Video: యూట్యూబ్ వీడియో మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేయండి ఇలా

YouTube Video: యూట్యూబ్ వీడియో మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

YouTube Video: యూట్యూబ్ వీడియో మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

YouTube Video Download | మీ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియో డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? యూట్యూబ్ యాప్‌లో ఈ ఆప్షన్ ఉండదు. కానీ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా యూట్యూబ్ వీడియో డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    యూట్యూబ్‌లో ఏదైనా వీడియో నచ్చిందంటే డౌన్‌లోడ్ చేయడం అంత ఈజీ కాదు. డౌన్‌లోడ్ ఆప్షన్ ఇవ్వలేదు యూట్యూబ్. కాబట్టి స్మార్ట్‌ఫోన్ యూజర్లు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్ ఉపయోగించి యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ (Youtube Video Download) చేస్తుంటారు. స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియో డౌన్‌లోడ్ చేయాలన్నా థర్డ్ పార్టీ యాప్ కావాలి. యూట్యూబ్‌లో కనిపించే డౌన్‌లోడ్ ఆప్షన్‌తో వీడియో డౌన్‌లోడ్ చేయొచ్చు. కానీ ఆ స్మార్ట్‌ఫోన్‌లో ఆఫ్‌లైన్‌లో వీడియో చూసేందుకు మాత్రమే ఈ డౌన్‌లోడ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆ ఫైల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. కానీ MP4 లాంటి ఫార్మాట్‌లో వీడియో డౌన్‌లోడ్ చేయాలంటే థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్ లేదా థర్డ్ పార్టీ యాప్ కావాల్సిందే. ఆన్‌లైన్‌లో ఇలాంటి యాప్స్, వెబ్‌సైట్స్ చాలా ఉన్నాయి. యూట్యూబ్ డౌన్‌లోడ్ ప్లగిన్స్ కూడా ఉన్నాయి. వీటితో మీకు నచ్చిన వీడియో డౌన్‌లోడ్ చేయొచ్చు.

    యూట్యూబ్ నియమనిబంధనల ప్రకారం యూట్యూబ్ స్వయంగా డౌన్‌లోడ్ లింక్ అందిస్తే తప్ప వీడియోలు డౌన్‌లోడ్ చేయకూడదు. అంతేకాదు... కాపీరైట్ చేసిన వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి, డూప్లికేట్ చేయడానికి యూజర్లకు అధికారం ఉండదు. యూట్యూబ్‌లో వీడియోలు డౌన్‌లోడ్ చేసేముందు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఆండ్రాయిడ్ యూజర్లు యూట్యూబ్ వీడియో ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

    iPhone Offer: రూ.17,599 ధరకే ఐఫోన్ సొంతం చేసుకోండి... అమెజాన్‌లో ఆఫర్

    ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియో డౌన్‌లోడ్ చేయండిలా


    Step 1- ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలు డౌన్‌లోడ్ చేయడానికి

    Step 2- ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి TubeMate యాప్ ఇన్‌స్టాల్ చేయాలి.

    Step 3- ట్యూబ్‌మేట్ యాప్ ఉపయోగించడానికి మీ ప్రైవసీ కంట్రోల్స్ సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది.

    Step 4- ఆ తర్వాత ట్యూబ్‌మేట్ యాప్ ఓపెన్ చేయాలి.

    Step 5- మీకు కావల్సిన యూట్యూబ్ వీడియోను సెర్చ్ చేయాలి.

    Step 6- ఆ తర్వాత డౌన్‌లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

    Step 7- రెజల్యూషన్, ఫార్మాట్ మీకు కావాల్సినట్టుగా సెలెక్ట్ చేయొచ్చు.

    Step 8- ఆ తర్వాత డౌన్‌లోడ్ పైన క్లిక్ చేయాలి.

    Step 9- మీ స్మార్ట్‌ఫోన్‌లోకి ఆ వీడియో డౌన్‌లోడ్ అవుతుంది.

    Step 10- డౌన్‌లోడ్ లిస్ట్ క్లిక్ చేసి వీడియోను లొకేట్ చేయొచ్చు.

    Xiaomi 11i vs Vivo V23: డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

    ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో యూట్యూబ్ వీడియో డౌన్‌లోడ్ చేయండిలా


    Step 1- ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో Readdle Documents యాప్ ఇన్‌స్టాల్ చేయాలి.

    Step 2- ఆ తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేయాలి.

    Step 3- www.videosolo.com/online-video-downloader/ లింక్ ఓపెన్ చేయాలి.

    Step 4- యూట్యూబ్ వీడియో యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేయాలి.

    Step 5- Download పైన క్లిక్ చేయాలి.

    Step 6- వీడియో వేర్వేరు ఫార్మాట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

    Step 7- ఆ తర్వాత Readdle Documents యాప్‌లో మీరు డౌన్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోలు కనిపిస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Iphone, Smartphone, Youtube

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు