WhatsApp Status: వాట్సప్ స్టేటస్ ఈజీగా డౌన్‌లోడ్ చేయండి ఇలా...

WhatsApp Status Download | ఎవరిదైనా వాట్సప్ స్టేటస్ నచ్చితే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలన్న సందేహం అందరిలో ఉంటుంది. వాట్సప్ స్టేటస్ డౌన్‌లోడ్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

news18-telugu
Updated: July 25, 2019, 10:47 AM IST
WhatsApp Status: వాట్సప్ స్టేటస్ ఈజీగా డౌన్‌లోడ్ చేయండి ఇలా...
WhatsApp Status: వాట్సప్ స్టేటస్ ఈజీగా డౌన్‌లోడ్ చేయండి ఇలా... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 25, 2019, 10:47 AM IST
వాట్సప్... మంచి క్రేజ్ ఉన్న మెసేజింగ్ యాప్. ఒకప్పుడు కేవలం మెసేజ్‌లు పంపడానికి మాత్రమే వాట్సప్ ఉపయోగపడేది. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ కూడా పంపేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దింది వాట్సప్. అంతేనా... ఎప్పటికప్పుడు కొత్తకొత్త అప్‌డేట్స్‌తో యాప్‌ను ఇంట్రెస్టింగ్‌గా మార్చేస్తోంది. వాట్సప్ అందించిన అద్భుతమైన ఫీచర్లలో స్టేటస్ ఫీచర్ కూడా ఒకటి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, ఫేస్‌బుక్ స్టోరీస్ లాగా వాట్సప్ స్టోరీస్ అంటే వాట్సప్ స్టేటస్ ట్రెండ్‌గా మారిపోయింది. నచ్చిన కొటేషన్ లేదా ఫోటో లేదా 30 సెకన్ల వీడియో... ఇలా ఏవైనా వాట్సప్ స్టేటస్‌లో పెట్టొచ్చు. వాట్సప్ స్టేటస్‌లో మీరు పెట్టిన ఫైల్ ఉండేది 24 గంటలు మాత్రమే. రోజూ వాట్సప్ స్టేటస్‌లు చూడటం అందరికీ అలవాటే. అయితే ఎవరిదైనా వాట్సప్ స్టేటస్ నచ్చితే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలన్న సందేహం అందరిలో ఉంటుంది. వాట్సప్ స్టేటస్ డౌన్‌లోడ్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా సులువుగా వాట్సప్ స్టేటస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

వాట్సప్ స్టేటస్ డౌన్‌లోడ్ చేయండి ఇలా...


ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Google Files యాప్ డౌన్‌లోడ్ చేయండి.

టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న మెనూ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
'Settings' ఓపెన్ చేసి 'show hidden files' ఆన్ చేయండి.
మీ ఫోన్‌లో ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లండి.


Internal storage>WhatsApp>Media>Statuses ఓపెన్ చేయండి.
Loading...
అక్కడ మీరు చూసిన వాట్సప్ స్టేటస్‌లు కనిపిస్తాయి.
మీకు కావాల్సిన ఫోటో లేదా వీడియో సెలెక్ట్ చేసి మీకు నచ్చినచోట సేవ్ చేసుకోండి.
దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఈ స్టెప్స్ ఫాలో అయితే వాట్సప్ స్టేటస్‌లు సేవ్ చేసుకోవచ్చు. కొన్ని ఫోన్లల్లో సెట్టింగ్స్‌లో కాస్త తేడా ఉంటుంది.

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...


ఇవి కూడా చదవండి:

Salary: మెట్రో నగరాల్లోని ఉద్యోగులకు గుడ్ న్యూస్... పెరగనున్న జీతం

Netflix: గుడ్ న్యూస్... రూ.199 ధరకే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కేరళ, తమిళనాడు టూర్... ప్యాకేజీ వివరాలివే
First published: July 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...