ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన వివాదాస్పద ప్రైవసీ పాలసీపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో
వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ, తమ డేటా అంతా తీసుకెళ్లి తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇవ్వనున్నట్లు తొలుత తీసుకున్న నిర్ణయంపై వాట్సాప్ వెనక్కి తగ్గకపోవడంతో కోట్లాది మంది యూజర్లు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో చాలా మంది తమ మొబైళ్లలో వాట్సాప్ యాప్‌ను తొలగిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. మీరు కూడా వాట్సాప్ అకౌంట్‌ను డిలిట్ చేయాలని అనుకుంటే... ముందుగా సర్వర్లలోని మెసేజ్‌లన్నింటినీ డిలీట్ చేసి, మీ వాట్సాప్ అకౌంట్‌ను అన్ఇన్స్టాల్ చేయండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఆండ్రాయిడ్ యూజర్లు ఇలా చేయండి..
ముందుగా మీ మొబైల్లోని వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి టాప్‌లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి.
అందులోని Settings ఓపెన్ చేయండి.
అందులో Account ఆప్షన్‌లోకి వెళ్లగానే అక్కడ మీకు Delete My Account అనే ఆప్షన్ కన్పిస్తుంది.
దానిపై క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్‌ను మరోసారి ఎంటర్ చేయమని అడుగుతుంది.
మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయడానికి కారణాలేంటి? అని అడుగుతుంది.
ఆ ప్రశ్నకు సమాధానమిచ్చాక, దిగవనున్న Delete my account బటన్‌పై క్లిక్ చేయాలి.
Jio New Plans: ఎక్కువ మొబైల్ డేటా కావాలా? రోజూ 3జీబీ డేటా వచ్చే జియో ప్లాన్స్ ఇవే
Amazon Smart TV: ఇండియాలో స్మార్ట్‌టీవీలు లాంఛ్ చేసిన అమెజాన్... ఫీచర్స్ ఇవే
దీంతో మీ వాట్సాప్ అకౌంట్ వెంటనే డిలీట్ అయిపోతుంది. ఆ తర్వాత యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా డైరెక్ట్‌గా యాప్ అన్ఇన్స్టాల్ చేస్తే మీ
డేటా అలాగే ఉంటుందని గుర్తించుకోండి. ఆండ్రాయిడ్ యూజర్ల లాగానే యాపిల్ iOS యూజర్లు కూడా వాట్సాప్ యాప్ డిలీట్ చేసుకోవడానికి ఇదే ప్రక్రియ ఫాలో అవ్వాలి.
ఒక్కసారి డిలీట్ చేస్తే అంతే...
ఒక వినియోగదారుడు వాట్సాప్ ఖాతాను డిలిట్) చేసిన తర్వాత, మళ్లీ దాన్ని యాక్సెస్ చేయలేరు. మళ్లీ వాట్సాప్ వాడాలనుకుంటే మాత్రం కొత్త ఖాతా తెరవాల్సిందే. వాట్సాప్ వారి సర్వర్ల నుండి యూజర్ డేటాను తొలగించడానికి మూడు నెలలు లేదా 90 రోజుల సమయం పడుతుంది.
Smartphones under Rs 20,000: కొత్త ఫోన్ కొనాలా? రూ.20,000 లోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్స్ ఇవే... 5జీ ఫోన్ కూడా
Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... ఇలా పొందండి
మీ డేటా ఇలా కలెక్ట్ చేసుకోండి..
వాట్సాప్ ఖాతా డిలిట్ చేసేముందు దానిలోని మీ ఛాటింగ్ హిస్టరీ, ఫైల్స్‌ను కలెక్ట్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా వాట్సాప్‌లోని సెట్టింగ్స్ ఆప్షన్‌ను ఎంచుకోండి. దానిలోని అకౌంట్ ఆప్షన్‌లోకి వెళ్లి Request Account Info పై క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీ రిక్వెస్ట్ వాట్సాప్‌కు వెళ్తుంది. అయితే, మీరు అడిగిన డేటా వెంటనే మీకు అందుబాటులోకి రాదు. మీ రిక్వెస్ట్ తీసుకొని వాట్సాప్ బ్యాక్ఎండ్లో మీ డేటాను సిద్ధం చేసి నోటిఫికేషన్ రూపంలో పంపిస్తుంది. అప్పుడు పాత విధానంలోనే Request Account Info కు వెళ్లి డౌన్లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తద్వారా జిప్ ఫైల్ రూపంలో మీ డేటా అంతా డౌన్లోడ్ అయిపోతుంది.