5G Phone : భారత్‌లో 5జీ సేవలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కొన్ని నగరాలకే 5జీ సేవలు(5G Services) అందాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని టెలికాం కంపెనీలు తెలిపాయి. 5జీ సేవలు పొందాలంటే ముందుగా 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉండాలి. మరోపక్క మొబైల్ కంపెనీలు గత రెండేళ్ల నుంచే 5జీ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను మార్కెట్లలోకి తీసుకొస్తున్నాయి. 5జీ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
చిప్సెట్
ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో చిప్సెట్ ఉంటుంది. అయితే 5జీ ఫోన్లో మాత్రం 5జీ టెక్నాలజీకి సపోర్ట్ చేసే చిప్సెట్ తప్పనిసరిగా ఉండాలి. మార్కెట్లలోకి విడుదలైన 5జీ మోడల్స్ల్లో క్వాల్కమ్ లేదా మీడియా టెక్ చిప్సెట్స్ ఉంటున్నాయి. స్నాప్‌డ్రాగన్ 695, 765జీ, 865 చిప్ సెట్స్ 5జీ నెట్ వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి. స్నాప్‌డ్రాగన్ 680 మాత్రం 4జీను సపోర్ట్ చేస్తుంది. ఇక, మీడియా టెక్‌లో డైమెన్సిటీ 700, 8100, 9000 చిప్సెట్స్ 5జీని సపోర్ట్ చేస్తాయి. కాబట్టి 5జీ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు అందులోని చిప్సెట్ 5జీకి సపోర్ట్ చేస్తుందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
బ్యాండ్స్
5జీ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు చిప్సెట్తో పాటు బ్యాండ్స్‌కు సంబంధించిన విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంటే మీరు కొనే స్మార్ట్‌ఫోన్ ఎన్ని రకాల 5జీ బ్యాండ్స్‌కు సపోర్ట్ చేస్తుందో తెలుసుకోవాలి. సాధారణంగా టెల్కోలు వివిధ రకాల బ్యాండ్స్‌తో 5జీ సేవలను అందిస్తుంటాయి. మీరు కొనుగోలు చేసే 5జీ స్మార్ట్‌ఫోన్ కనీసం 10 నుంచి 12 రకాల బ్యాండ్స్‌కు సపోర్ట్ చేస్తుండాలి. అంతకంటే తక్కువగా ఉంటే కొనుగోలు చేయకపోవడం ఉత్తమం. భవిష్యత్‌లో టెల్కోలు బ్యాండ్స్‌లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. దీంతో తక్కువ బ్యాండ్స్ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే భవిష్యత్‌లో 5జీ సేవలు పొందడంలో అంతరాయం ఏర్పడవచ్చు.
రెగ్యులర్ అప్డేట్స్
5జీ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు గమనించాల్సిన విషయాల్లో అప్ డేట్స్ ఒకటి. కొన్ని ఫోన్లు 5జీకి సపోర్ట్ చేస్తున్నా.. నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేయడానికి 5జీ అప్డేట్ తప్పనిసరి. ప్రముఖ మొబైల్ కంపెనీలు యాపిల్, శామ్సంగ్, గూగూల్ తమ 5జీ అప్డేట్లను మరికొన్ని నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నాయి. బడ్జెట్ రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5జీ సపోర్ట్ అప్డేట్ ఎప్పుడు రోల్ అవుట్ అవుతుందో మొబైల్ కంపెనీ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
బ్యాటరీ
5G నెట్‌వర్క్‌తో డేటా బ్యాండ్‌విడ్త్‌తో పాటు ఫోన్ బ్యాటరీ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం 5000mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే బెటర్. అలాగే ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుండాలి. దీంతో ఫోన్ వినియోగంలో ఛార్జింగ్ కారణంగా పెద్దగా అంతరాయం ఉండదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g phones, 5g service, 5G Smartphone