Home /News /technology /

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా రిస్ట్రిక్ట్​ ఫీచర్​.. నచ్చని వారిని బ్లాక్​, అన్​ఫాలో చేయడం ఇలా

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా రిస్ట్రిక్ట్​ ఫీచర్​.. నచ్చని వారిని బ్లాక్​, అన్​ఫాలో చేయడం ఇలా

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

సోషల్ మీడియా (Social Media) ఖాతాల్లో కొందరు మనకు అవసరం లేని పోస్ట్ లు పెడుతూ ఉంటారు. మనం చేసే పోస్టులపై అనవసర కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని పూర్తిగా బ్లాక్ చేయడానికి మొహమాటం అడ్డువస్తూ ఉంటుంది. అలాంటి వారిని పాక్షికంగా నియంత్రించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్(Instagram New Feature) ​ను అందుబాటులోకి తెచ్చింది.

ఇంకా చదవండి ...
సోషల్ మీడియా (Social Media) ఖాతాల్లో కొందరు మనకు అవసరం లేని పోస్ట్ లు పెడుతూ ఉంటారు. మనం చేసే పోస్టులపై అనవసర కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని పూర్తిగా బ్లాక్ చేయడానికి మొహమాటం అడ్డువస్తూ ఉంటుంది. అలాంటి వారిని పాక్షికంగా నియంత్రించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. రిస్ట్రిక్ట్ ఫీచర్​ ద్వారాఅవసరం లేని పోస్ట్ లను నియంత్రించవచ్చు. కొందరి మెసేజ్ (Message) లను బ్లాక్ చేసినా, చదివినా కూడా ఆ పోస్ట్ చేసిన వారికి తెలియకుండా చేయవచ్చు. అవసరం లేని అకౌంట్లను నియంత్రించడం ద్వారా, కేవలంకామెంట్లను పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రమే చూడగలుగుతారు. మీరు ఎవరినైతే నియంత్రించాలనుకుంటున్నారో అలాంటి వారి కామెంట్లు అందరికీ కనిపించకుండా ఈ కొత్త ఫీచర్​ ద్వారా చేయవచ్చు.

1. యూజర్ల ప్రొఫైళ్లను రిస్ట్రిక్ట్ చేసే ప్రక్రియ
మీరు ఎవరిని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారోవారి ప్రొఫైల్సెట్టింగ్స్​లోకి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం ముందుగా మీ ఆండ్రాయిడ్, ఐపోన్లలో ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్ చేయండి.మీరు రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్న ప్రొఫైల్ కు వెళ్లండి.రిస్ట్రిక్ట్​పైక్లిక్ చేయండి.తరువాత ఇన్‌స్టాగ్రామ్‌ఓ పాప్ అప్ చూపిస్తుంది. అక్కడ రిస్ట్రిక్ట్ అకౌంట్​పై క్లిక్ చేయండి.అన్ రిస్ట్రిక్ట్ చేయాలని భావిస్తే మరలా అన్ రిస్ట్రిక్ట్ క్లిక్ చేసి తీసివేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ లో బంపరాఫర్.. కేవలం రూ.15కే Oppo A12 స్మార్ట్ ఫోన్.. ఆఫర్ వివరాలివే

2.డైరెక్ట్ మెసేజ్ ద్వారా రిస్ట్రిక్ట్​ చేసే విధానం
ఇన్‌స్టాగ్రామ్‌లోఎవరినైనా నియంత్రించాలంటే డైరెక్ట్ మెసేజ్ విభాగానికి వెళ్లాలి.మీరు ఎవరినైతే రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటునారోవారి చాట్ తెరవండి. చాట్ పైన వ్యక్తి పేరు క్లిక్ చేయండి. షేర్డ్ మీడియా, చాట్ సెట్టింగ్ లు ఓపెన్ అవుతాయి. అక్కడ రిస్ట్రిక్ట్ బటన్ క్లిక్ చేయండి.
Airtel 1.5GB Data Plans: రోజూ 1.5జీబీ డేటా వాడుతున్నారా? ఎయిర్‌టెల్ లేటెస్ట్ ప్లాన్స్ ఇవే

3. సెట్టింగ్స్ ద్వారా రిస్ట్రిక్ట్ చేసే విధానం
ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్ చేసి ప్రొఫైల్ కు వెళ్లండి. కుడి భాగం ఎగువ కార్నర్ లో మూడు లైన్ లను క్లిక్ చేయండి. తరువాత సెట్టింగ్స్ లో ప్రైవసీకి వెళ్లాలి. కనెక్షన్స్ కింద రిస్ట్రిక్ట్ అకౌంట్స్ క్లిక్ చేయాలి.ఇలా చేయడం ద్వారా మీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ రిస్ట్రిక్ట్ చేసే ఫ్యూచర్స్ చూపిస్తుంది. ఎవరినైతే రిస్ట్రిక్ట్​చేయాలనుకుంటున్నారో సెర్చ్ లో వారి ఖాతా పరిశీలించి, వారి పేరు పక్కన రిస్ట్రిక్ట్ క్లిక్ చేస్తే చాలు. వారి ఖాతాల నుంచి వచ్చే పోస్ట్ లను అదుపులో పెట్టవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Instagram, Social Media

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు