WhatsApp: వాట్సప్‌లో ఛాట్స్ ఇలా బ్యాకప్ చేసుకోండి

WhatsApp Backup and Restore Process | మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని వాట్సప్ ఛాట్ హిస్టరీని గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ ఫోన్‌లోకి కావాలంటే ఆ ఫోన్‌లోకి వాట్సప్ ఛాట్స్ రీస్టోర్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: June 19, 2019, 6:30 PM IST
WhatsApp: వాట్సప్‌లో ఛాట్స్ ఇలా బ్యాకప్ చేసుకోండి
WhatsApp: వాట్సప్‌లో ఛాట్స్ ఇలా బ్యాకప్ చేసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్... టాప్ మెసెంజర్ యాప్. భారతదేశంలో 20 కోట్ల మంది యాక్టీవ్ యూజర్లున్నారు. చాలామందికి రోజు మొదలయ్యేది, ముగిసేది వాట్సప్‌తోనే. అసలు వాట్సప్ ఉపయోగించని రోజు ఉండదు. అయితే ఫోన్ మార్చినప్పుడో లేదా యాప్ అన్ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేసినప్పుడో అందరికీ ఎదురయ్యే సమస్య పాత ఛాట్స్ అన్నీ డిలిట్ కావడం. అలా పాత ఛాట్స్ డిలిట్ కాకుండా మళ్లీ రీస్టోర్ చేసుకోవాలని చాలామంది కోరుకుంటారు. వాట్సప్ ఛాట్స్ బ్యాకప్ చేస్తే రీస్టోర్ చేయడం సులువే. అందుకే మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని వాట్సప్ ఛాట్ హిస్టరీని గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ ఫోన్‌లోకి కావాలంటే ఆ ఫోన్‌లోకి వాట్సప్ ఛాట్స్ రీస్టోర్ చేసుకోవచ్చు.

గూగుల్ డ్రైవ్‌లోకి వాట్సప్ ఛాట్స్ బ్యాకప్ చేయండి ఇలా...



ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న 'Menu' పైన క్లిక్ చేయండి.
సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'Chats' పైన క్లిక్ చేయండి.
చివర్లో కనిపించే 'Chat backup' పైన క్లిక్ చేయండి.
'Back up to Google Drive' పైన క్లిక్ చేసి ఎప్పుడు మీ వాట్సప్ ఛాట్స్ బ్యాకప్ చేయాలో సెలెక్ట్ చేసుకోండి.
ఛాట్స్ బ్యాకప్ చేయాలనుకునే జీమెయిల్ అకౌంట్‌ను సెలెక్ట్ చేయండి.Back up over ఆప్షన్‌లో Wi-Fi లేదా Wi-Fi and cellular network ఆప్షన్ ఎంచుకోండి.
వీడియోలు కూడా బ్యాకప్ చేయాలనుకుంటే ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
చివరగా backup పైన క్లిక్ చేస్తే మీ వాట్సప్ ఛాట్స్ గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతాయి.

గూగుల్ డ్రైవ్ నుంచి వాట్సప్ ఛాట్స్ రీస్టోర్ చేయండి ఇలా...


మీరు ఫోన్‌లో వాట్సప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత పాత సిమ్ కార్డుతోనే నెంబర్ వెరిఫై చేయాలి.
ఫోన్ నెంబర్, కంట్రీ కోడ్‌తో వెరిఫై చేయాలి.
వెరిఫికేషన్ తర్వాత 'Continue' క్లిక్ చేయాలి. అప్పుడే వాట్సప్ గూగుల్ డ్రైవ్ డేటాను యాక్సెస్ చేస్తుంది.
'Give Permission' క్లిక్ చేయడం ద్వారా గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చెక్ చేస్తుంది వాట్సప్.
మీరు ఏ జీమెయిల్ ఐడీతో గూగుల్ డ్రైవ్‌లోకి వాట్సప్ ఛాట్స్ బ్యాకప్ చేశారో, అదే జీమెయిల్ ఐడీతో ఫోన్‌లో లాగిన్ కావడం తప్పనిసరి.
'Restore' పైన క్లిక్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లో ఉన్న వాట్సప్ ఛాట్స్ రీస్టోర్ అవుతాయి.
ఫైల్ సైజ్‌ని బట్టి రీస్టోర్‌కు సమయం తీసుకుంటుంది.

Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

EPF Withdraw: మీ పీఎఫ్ డబ్బులు ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసా?

పాత ఫోన్ అమ్మేస్తున్నారా? ఈ 7 జాగ్రత్తలు మర్చిపోవద్దు

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Published by: Santhosh Kumar S
First published: June 19, 2019, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading