హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

ట్రూకాలర్ నుంచీ మన నంబర్ తీసేయడం ఎలా? సింపుల్ ట్రిక్... ఫాలో అవ్వండి మరి

ట్రూకాలర్ నుంచీ మన నంబర్ తీసేయడం ఎలా? సింపుల్ ట్రిక్... ఫాలో అవ్వండి మరి

ట్రూకాలర్ యాప్ (File)

ట్రూకాలర్ యాప్ (File)

Truecaller Tips : ట్రూకాలర్‌లో మన వివరాలు తెలియకుండా చేసుకోవాలంటే దానికీ ఛాన్స్ ఉంది. మన నంబర్, నేమ్‌ని ట్రూ కాలర్ నుంచీ తీసివేయించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

    ట్రూకాలర్ యాప్‌తో ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఏ మొబైల్ నంబర్ వివరాలైనా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా కొత్త నంబర్‌తో ఎవరికైనా కాల్ చేస్తే... వాళ్ల మొబైల్‌లో ట్రూకాలర్ యాప్ ఉంటే, అందులో మీ నంబర్, పేరు కూడా కనిపిస్తుంది. తద్వారా కాల్ చేసింది ఎవరో తెలుసుకోగలరు. ఇదెలా సాధ్యమంటే... ఈ యాప్‌లో అన్ని నంబర్ల వివరాలూ ఉంటాయి. అందువల్ల ఎవరు ఏ నంబర్‌తో కాల్ చేసినా... వాళ్ల పేరు, వివరాల్ని ఇట్టే చెప్పేస్తుంది ట్రూకాలర్. ఐతే... ట్రూకాలర్‌లో కూడా మన వివరాలు తెలియకుండా చేసుకోవాలంటే దానికీ ఛాన్స్ ఉంది. మన నంబర్, నేమ్‌ని ట్రూ కాలర్ నుంచీ తీసివేయించుకోవచ్చు.


    ఈ ట్రిక్ తెలుసుకునే ముందు... ట్రూకాలర్ యాప్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. గూగుల్ ప్లే నుంచీ ఈ యాప్ ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ని ట్రూ సాఫ్ట్‌వేర్ స్కాండినేవియా ఏబీ కంపెనీ తయారుచేసింది. దీని సైజ్ 8.6 ఎంబీ మాత్రమే. ఇప్పటికే ఈ యాప్‌ని 50 కోట్ల సార్లకు పైగా గూగుల్ ప్లే నుంచీ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్ లేదా అంతకంటే అప్‌డేటెడ్ వెర్షన్ మొబైళ్లలో మాత్రమే పనిచేస్తుంది.


    ట్రూకాలర్‌లో ముఖ్యమైన ఫీచర్లు :

    * నంబర్ వివరాలు తెలుసుకోవచ్చు.

    * ఏ కాల్ అయినా, బ్లాక్ చెయ్యవచ్చు. సేల్స్ కాల్స్ కూడా.

    * ట్రూకాలర్ నుంచి కూడా కాల్ చెయ్యవచ్చు

    * ఫలానా నంబర్‌తో ఎవరైనా మాట్లాడుతూన్నారో లేదో తెలుసుకోవచ్చు.


    ట్రూకాలర్ నుంచీ నంబర్ తీసేయడం ఎలా? : ట్రూకాలర్ నుంచీ మీ నంబర్ తొలగించాలంటే... ముందు మీ మొబైల్‌లో ట్రూకాలర్ యాప్ ఉండకూడదు. తద్వారా ఆ నంబర్‌ను ట్రూకాలర్ గుర్తించలేదు. సోషల్ మీడియాలో మొబైల్ నంబర్ల డీటెయిల్స్ మాత్రమే ట్రూకాలర్ సేకరిస్తుంది. అదే సోషల్ మీడియాలో (ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సావ్, ఇతర వెబ్‌సైట్లలో ) మీ నంబర్ ఉండకుండా చేసుకోవాలి. అప్పుడు మీ నంబర్‌ను ట్రూకాలర్ ట్రాక్ చెయ్యలేదు. ఒకవేళ ట్రూకాలర్ ఎప్పుడో మీ నంబర్ ట్రాక్ చేసి ఉంటే... దాన్ని తొలగించేందుకు ఇలా చెయ్యండి.


    * మీ మొబైల్‌లో ట్రూకాలర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చెయ్యండి.

    * యాప్ ఓపెన్ చేసి, మెనూలోకి వెళ్లండి.

    * సెట్టింగ్ లోకి వెళ్లండి.

    * ప్రైవసీ కార్నర్‌లోకి వెళ్లండి.

    * డీయాక్టివేట్ ఆప్షన్ ఎంచుకోండి.


    ఇప్పుడు ట్రూకాలర్ యాప్‌లో మీ నంబర్ డీయాక్టివేట్ అయినట్లు. వెంటనే మీరు ఆ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చెయ్యండి. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ నంబర్‌ని వాడకుండా ఉంటే... ట్రూకాలర్ దాన్ని గుర్తించలేదు. ఐఫోన్, విండోస్ ఫోన్లకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.


     


    ఇవి కూడా చదవండి :

    ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలా? మీ కోసమే ఈ వెబ్‌సైట్లు... ట్రై చెయ్యండి మరి


    గోల్డ్ స్కీముల్లో డబ్బులు పెట్టారా... కొత్త చట్టం వస్తోంది... అందులో ఏముందంటే...


    స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసుకోవాలా... 6 మార్గాలున్నాయి... ఇలా చెయ్యండి

    First published:

    Tags: Business, BUSINESS NEWS, Information Technology, Online business, Technology, Truecaller

    ఉత్తమ కథలు