హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Set Destination Alert: ట్రైన్‌ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా..? ఎలాంటి యాప్ లేకుండా వేకప్ అలర్ట్ ను ఇలా సెట్ చేసుకోండి..

Set Destination Alert: ట్రైన్‌ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా..? ఎలాంటి యాప్ లేకుండా వేకప్ అలర్ట్ ను ఇలా సెట్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవలే ప్యాసింజర్ల కోసం వేకప్ కాల్ అలర్ట్ లేదా డెస్టినేషన్ అలర్ట్ (Destination Alert) అనే ఓ కొత్త ఫీచర్‌ను ఇండియన్ రైల్వే పరిచయం చేసింది. ఈ ఫీచర్ గమ్యస్థానం చేరుకోవడానికి 20 నిమిషాల ముందే ప్రయాణికులను కాల్ (Call) ద్వారా మేల్కొల్పుతుంది.

ఇంకా చదవండి ...

గతంతో పోల్చుకుంటే ఇండియన్ రైల్వే (Indian Railways) చాలా డెవలప్ అయింది. ఆన్‌లైన్‌లోనే టిక్కెట్‌ బుకింగ్(Ticket Booking), ట్రైన్లలోనే ఫుడ్ ఆర్డర్(Food Order) చేయడం వంటి సదుపాయాలు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ప్యాసింజర్ల కోసం వేకప్ కాల్ అలర్ట్(Wake Up Call Alert)  లేదా డెస్టినేషన్ అలర్ట్ (Destination Alert) అనే ఓ కొత్త ఫీచర్‌ను(New Feature) కూడా ఇండియన్ రైల్వే(Indian Railway) పరిచయం చేసింది. ఈ ఫీచర్(Feature) గమ్యస్థానం చేరుకోవడానికి 20 నిమిషాల ముందే ప్రయాణికులను కాల్ (Call) ద్వారా మేల్కొల్పుతుంది. ఈ ఫీచర్ రాత్రుళ్లు ఒంటరిగా ప్రయాణించే ప్యాసింజర్లకు సహాయకరంగా ఉంటుంది.

మరి మీరు కూడా నైట్ టైమ్‌లో ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నట్లయితే.. దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా జాగారం చేయక్కర్లేదు. ఎందుకంటే కొత్త ఫీచర్ మీరు దిగాల్సిన స్టేషన్ రాకముందే వేకప్ కాల్ ద్వారా మిమ్మల్ని నిద్ర లేపుతుంది. తద్వారా నిద్రలోకి జారుకున్నా స్టేషన్ మిస్సయ్యే అవకాశమే ఉండదు. మరి డెస్టినేషన్ అలర్ట్ లేదా వేకప్ కాల్ ఎలా సెట్ చేసుకోవాలో స్టెప్-బై-స్టెప్ తెలుసుకుందాం.

డెస్టినేషన్ అలర్ట్ లేదా వేకప్ కాల్ అలర్ట్‌ను ఎలా సెట్ చేయాలి

డెస్టినేషన్ అలర్ట్ సెట్ చేయడానికి మీకు ఇంటర్నెట్ అవసరం లేదు. కాబట్టి ఈ ఫీచర్‌ను వృద్ధులు కూడా చాలా సులభంగా వాడుకోవచ్చు. ఈ ఫీచర్ పొందడానికి మీ వద్ద ఫోన్ ఉండాలి. ఆ తర్వాత కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వాలి.

Samsung Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,750 డిస్కౌంట్... 6,000mah బ్యాటరీ, అమొలెడ్ డిస్‌ప్లే మరెన్నో ప్రత్యేకతలు

Step 1:  మీ ఫోన్‌లో డయలర్‌ ఓపెన్ చేయాలి.

Step 1:  139కి డయల్ చేయాలి. కస్టమర్ కేర్ అసిస్టెంట్ మాట్లాడే వరకు వెయిట్ చేయాలి.

Step 1: నిర్దిష్ట సంఖ్యపై క్లిక్ చేయడం ద్వారా మీకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు హిందీకి 1, ఇంగ్లీష్ కోసం 2 నొక్కాలి.

Step 1: ఇంగ్లీష్ భాష కావాలంటే 2పై నొక్కాలి. లేదా ఇతర భాషల కోసం 3పై నొక్కాలి.

Step 1: వేకప్ అలర్ట్ లేదా డెస్టినేషన్ అలర్ట్‌ను సెటప్ చేయడానికి 7పై నొక్కాలి.

Step 1:  డెస్టినేషన్ అలర్ట్‌ను లేదా వేకప్ కాల్‌ని పొందాలనుకుంటే నంబర్ 2 నొక్కాలి.

Step 1:  అనంతరం మీ 10-అంకెల ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (PNR) నంబర్‌ను ఎంటర్ చేసి, కన్ఫర్మేషన్ కోసం నంబర్ 1 ప్రెస్ చేయాలి.

Step 1:  కాల్ చేయడం కుదరకపోతే మీరు అలర్ట్ (Alert) అని టైప్ చేసి 139 నంబర్‌కు మెసేజ్ చేస్తే సరిపోతుంది.

Aadhaar Card: పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం ఆధార్ ఇవ్వాల్సిందేనా? రూల్స్ తెలుసుకోండి

పైన పేర్కొన్న స్టెప్స్ ఫాలో అయ్యి ట్రైన్ జర్నీలో డెస్టినేషన్ అలర్ట్‌ను లేదా వేకప్ కాల్‌ని సులభంగా సెట్ చేయవచ్చు. ఇది కాకుండా 139 హెల్ప్‌లైన్ నంబర్‌తో, మీరు చాలా సర్వీసులు పొందొచ్చు. భద్రత, వైద్య సహాయాన్ని పొందడంతో పాటు లంచం సంబంధిత ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు, నేరుగా కస్టమర్ ప్రతినిధితో మాట్లాడవచ్చు లేదా మీ టిక్కెట్ గురించి అడిగి తెలుసుకోవచ్చు. మీ టికెట్/సీటు స్టేటస్ కూడా కాన్సిల్ చేయవచ్చు లేదా చెక్ చేయవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Destination, Indian Railways, Railway passengers

ఉత్తమ కథలు