హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vu TV: వీయూ టెలివిజన్స్ నుంచి ఇండియాలో ప్రీమియం టీవీ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..

Vu TV: వీయూ టెలివిజన్స్ నుంచి ఇండియాలో ప్రీమియం టీవీ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..

(image: Vu India)

(image: Vu India)

వీయూ కంపెనీ నుంచి ఇండియాలో కొత్త ప్రీమియం TV 2023 ఎడిషన్‌ (Vu Premium TV 2023 Edition) లాంచ్ అయింది. ఈ కొత్త 4K TVలు 43-అంగుళాలు, 55-అంగుళాల డిస్‌ప్లే సైజులలో అందుబాటులోకి వచ్చాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Vu TV: ప్రముఖ టీవీ బ్రాండ్ వీయూ టెలివిజన్స్ (Vu Televisions) తక్కువ ధరల్లోనే అద్భుతమైన ఫీచర్లతో టీవీలు లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీ 24x7 కస్టమర్ సపోర్టు, అనేక సర్వీస్ సెంటర్లతో మరింత పాపులర్ అయింది. కాగా తాజాగా ఈ కంపెనీ నుంచి ఇండియాలో కొత్త ప్రీమియం TV 2023 ఎడిషన్‌ (Vu Premium TV 2023 Edition) లాంచ్ అయింది. ఈ కొత్త 4K TVలు 43-అంగుళాలు, 55-అంగుళాల డిస్‌ప్లే సైజులలో అందుబాటులోకి వచ్చాయి. వీటి డిస్‌ప్లే సైజులు పెద్దవే అయినా రేట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. Vu TV 2023 ఎడిషన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, Vutvs.comతో సహా భారతదేశ వ్యాప్తంగా రిటైల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. మరి ఈ ప్రీమియం టీవీలో అందించిన ఆకర్షణీయమైన ఫీచర్లు ఏవి, సైజుల ప్రకారం వాటి ధరలు ఎంతో తెలుసుకుందాం.

* ధరల వివరాలు..

లేటెస్ట్ Vu ప్రీమియం TV 2023 ఎడిషన్‌లో 43-అంగుళాలు, 55-అంగుళాల టీవీలు ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అయితే 43 అంగుళాల మోడల్ ధరను రూ.23,999గా, 55 అంగుళాల మోడల్ ధరను రూ.32,999గా కంపెనీ నిర్ణయించింది.

* Vu ప్రీమియం TV ఫీచర్లు

కొత్త Vu ప్రీమియం TV మూడు వైపులా ఫ్రేమ్‌లెస్ అంచులతో నాజుకైన డిజైన్‌తో వచ్చింది. ఇందులో 4K హై-క్వాలిటీ డిస్‌ప్లే రిజల్యూషన్‌ స్క్రీన్‌ను అందించారు. దీనిలో 400నిట్స్ హై బ్రైట్‌నెస్ IPS ప్యానెల్‌ ఇచ్చారు. ఇది ఇమేజ్‌లు మెరుగ్గా కనిపించేలా చేసే AI పిక్చర్ బూస్టర్‌తో వస్తుంది. అలానే HDR10తో హై-క్వాలిటీ వీడియోను ప్లే చేస్తుంది. ఇక 43-అంగుళాలు, 55-అంగుళాల మోడల్స్‌ డిజిటల్ నాయిస్ రెడక్షన్‌తో వస్తాయి. ఈ టీవీలు గేమర్‌ల కోసం ఇన్‌పుట్ ల్యాగ్‌ను తగ్గించే ఆటో లో లేటెన్సీ మోడ్, చిత్రంలో కాంట్రాస్ట్‌ను మెరుగుపరిచే డైనమిక్ కాంట్రాస్ట్‌, గేమింగ్ కోసం సెట్టింగ్స్‌ను ఆప్టిమైజ్ చేసే గేమ్ మోడ్ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను సైతం ఆఫర్ చేస్తాయి.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ ఈవెంట్‌.. ఈ 5G స్మార్ట్‌ఫోన్స్‌పై బెస్ట్ డీల్స్..!

టీవీల ఆడియో సెటప్‌ విషయానికి వస్తే.. ఈ టీవీ ఎడిషన్‌లో సౌండ్‌బార్‌తో కూడిన లౌడ్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో 50W సౌండ్ ఔట్‌పుట్‌ను ప్రొడ్యూస్ చేసే రెండు పెద్ద స్పీకర్లు, రెండు ట్వీటర్లు ఉంటాయి. ఇది నైట్, సౌండ్ ఓన్లీ వంటి విభిన్న మోడ్‌లతో డాల్బీ ఆడియో, సరౌండ్ సౌండ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. కంపెనీ మెరుగైన సౌండ్ ప్రొజెక్షన్ కోసం సౌండ్‌బార్‌ను టీవీ ముందు భాగంలో ఆఫర్ చేసింది. కొత్త Vu TV Google TV OSని ఉపయోగిస్తుంది. ఈ ఓఎస్ Play Store ద్వారా వివిధ రకాల యాప్‌లు, ప్రముఖ OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఇందులో ఇన్-బిల్ట్ Chromecast, పేరెంటల్ కంట్రోల్స్, కిడ్స్ మోడ్‌ను కూడా ఇచ్చారు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, బ్లూటూత్ 5.0, Wi-Fi 802.11 ac, AV ఇన్‌పుట్, ఈథర్‌నెట్ ఉన్నాయి.

కొత్త Vu ప్రీమియం TV 2023 ఎడిషన్ 2GB RAM + 16GB స్టోరేజ్‌, 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. హాట్‌కీ యాక్టివాయిస్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. ఇది గూగుల్ అసిస్టెంట్‌కి యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ టీవీ రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ కోసం ప్రత్యేక బటన్లు ఉంటాయి.

First published:

Tags: Smart TV, Technolgy

ఉత్తమ కథలు