హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vu Smart TV: వ్యూ ప్రీమియం స్మార్ట్ టీవీ వచ్చేసింది... ధర రూ.12,999 మాత్రమే

Vu Smart TV: వ్యూ ప్రీమియం స్మార్ట్ టీవీ వచ్చేసింది... ధర రూ.12,999 మాత్రమే

Vu Premium 32 Smart TV | స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? 32 ఇంచ్ స్మార్ట్ టీవీ తీసుకోవాలని అనుకుంటున్నారా? వ్యూ ఎలక్ట్రానిక్స్ నుంచి 32 అంగుళాల స్మార్ట్ టీవీ (32 inch Smart TV) లాంఛ్ అయింది. స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  వ్యూ ఎలక్ట్రానిక్స్ ప్రీమియం 32 స్మార్ట్ టీవీని ఇండియాలో లాంఛ్ చేసింది. కేవలం 32 అంగుళాల మోడల్‌ను మాత్రమే పరిచయం చేసింది. వ్యూ ప్రీమియం 32 స్మార్ట్ టీవీ (Vu Premium 32 Smart TV) ధర కేవలం రూ.12,999 మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమైంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇక వ్యూ ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక ఏడాది డొమెస్టిక్ వారెంటీ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 20వాట్ సౌండ్ ఔట్‌పుట్, డాల్బీ ఆడియో సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పటికే రియల్‌మీ, షావోమీ, టీసీఎల్, మార్‌క్యూ, మైక్రోమ్యాక్స్, థామ్సన్, బ్లాపంక్ట్ లాంట్ బ్రాండ్స్ నుంచి రూ.15,000 లోపు స్మార్ట్ టీవీలు ఉన్న సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ మొదలైంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, సిటీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

  వ్యూ ప్రీమియం 32 స్మార్ట్ టీవీ ఫీచర్స్

  వ్యూ ప్రీమియం 32 స్మార్ట్ టీవీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 32 అంగుళాల టీవీ. ఏ+ గ్రేడ్ ప్యానెల్‌తో 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉంది. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉండటం విశేషం. ఫ్రేమ్‌లెస్ డిజైన్ ఉంది. ఇందులో అడాప్టీవ్ కాంట్రాస్ట్ ఫీచర్ ఉంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 1జీబీ ర్యామ్ ఉండగా 4జీబీ స్టోరేజ్ ఉంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

  Vivo Y75 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో వివో వై75 రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

  ఈ స్మార్ట్ టీవీలో రెండు స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20వాట్ సౌండ్ ఔట్‌పుట్ వస్తుంది. డీటీఎస్ ట్రూ సరౌండ్ టెక్నాలజీ కూడా ఉంది. సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, రెండు యూఎస్‌బీ పోర్టులు, రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఏవీ ఇన్‌పుట్, ఆడియో జాక్ సపోర్ట్ ఉంది. ఇక పాటలు, మ్యూజిక్, పాడ్‌క్యాస్ట్ వినాలనుకునేవారి కోసం ఆడియో ఓన్లీ మోడ్ ఉండటం విశేషం. ఈ మోడ్ ఆన్ చేస్తే విజువల్స్ కనిపించకుండా కేవలం ఆడియో మాత్రమే ప్లే అవుతుంది.

  Samsung Galaxy F42: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 డిస్కౌంట్... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

  ఓటీటీ ఫీచర్స్ చూస్తే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మ్యూజిక్, బ్రౌజర్ యాప్స్, ఇంటర్నెట్ బ్రౌజర్ లాంటివి యాక్సెస్ చేయొచ్చు. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ నుంచి డయల్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ నుంచి టీవీలో యాప్స్ ఓపెన్ చేయొచ్చు. వ్యూ ఎనీవ్యూ క్యాస్ట్ ఫీచర్‌తో స్క్రీన్ మిర్రరింగ్ చేయొచ్చు. లో లైట్‌లో కంటెంట్ చూసేందుకు సినిమా నైట్ మోడ్ ఉండటం విశేషం. వ్యూ ప్రీమియం 32 స్మార్ట్ టీవీ తక్కువ ఎనర్జీ ఉపయోగించుకుంటుందని, 50,000 గంటల ఆపరేటింగ్ టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

  First published:

  Tags: Smart TV

  ఉత్తమ కథలు