Home /News /technology /

VOLKSWAGEN INDIA SALES DOUBLE AS TAIGUN VIRTUS FIND SUCCESS UMG GH

Volkswagen: దూసుకెళ్తున్న వోక్స్‌వ్యాగన్.. ఒకేసారి డబుల్ సేల్స్.. ఆ మోడళ్లకు బీభత్సమైన క్రేజ్

వోక్స్‌వ్యాగన్ సేల్స్ డబుల్

వోక్స్‌వ్యాగన్ సేల్స్ డబుల్

జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్.. ఇండియాలో భారీ అమ్మకాలతో దూసుకుపోతోంది. గత ఏడాది మొదటి అర్ధభాగంతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలానికి కంపెనీ కార్ల అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఈ విషయాన్ని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా వెల్లడించింది.

ఇంకా చదవండి ...
జర్మన్ (German) కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ (Volkswagen).. ఇండియాలో భారీ అమ్మకాలతో దూసుకుపోతోంది. గత ఏడాది మొదటి అర్ధభాగంతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలానికి కంపెనీ కార్ల (Cars) అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఈ విషయాన్ని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా వెల్లడించింది. కొత్తగా లాంచ్ చేసిన వోక్స్‌వ్యాగన్ విర్టస్ (Virtus), టిగువాన్‌ (Tiguan) వేరియంట్లకు ఆదరణ.. మొత్తం అమ్మకాల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. టిగువాన్‌కు పెరుగుతున్న డిమాండ్ కూడా రికార్డు స్థాయి అమ్మకాలకు తోడ్పడింది.

2022 మొదటి అర్ధభాగంలో (జనవరి నుంచి జూన్ వరకు) వోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో 21,588 యూనిట్లను విక్రయించింది. 2021లో అదే కాలానికి కేవలం 10,843 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గతంలో రిలీజ్ అయిన సిరీస్‌ల నుంచి సెకండ్ జనరేషన్ కార్లపై కంపెనీ దృష్టి పెట్టడంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. జూన్ 9న సంస్థ నుంచి విర్టస్ మోడల్ లాంచ్ అయింది. ఆ రోజు నుంచి వోక్స్‌వ్యాగన్ మెగా డెలివరీ ప్రోగ్రామ్ ద్వారా 2,500 పైగా విర్టస్ కార్లను డెలివరీ చేసింది.

ఇదీ చదవండి: మారుతి సుజుకి బ్రెజ్జా లేటెస్ట్ వెర్షన్ లాంచ్.. రికార్డు స్థాయిలో బుకింగ్స్


అయితే అమ్మకాలలో వృద్ధి ఇలాగే కొనసాగే అవకాశం లేదు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. తమ తయారీ సామర్థ్యం కంటే బ్రాండ్ నుంచి వస్తున్న కార్లకు డిమాండ్ 30-40 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు వోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా. టైమ్స్‌ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సెమీకండక్టర్ల కొరతతో పాటు ఐరోపాలో పరిస్థితులు ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఫలితంగా ఉత్పత్తి తగ్గిపోయి, ఈ ఏడాది ద్వితీయార్ధంలో అమ్మకాలపై ప్రభావం పడవచ్చని విశ్లేషించారు.

ఈ ఏడాది మూడో త్రైమాసికం తమ కంపెనీకి సవాలుగా ఉంటుందని గుప్తా పేర్కొన్నారు. ఆ సమయానికి పరిస్థితులు మెరుగుపడతాయని ఏడాది ప్రారంభంలో అంచనా వేసినప్పటికీ, ఐరోపాలోని భౌగోళిక రాజకీయ పరిస్థితి, చైనాలో లాక్‌డౌన్‌లతో పరిస్థితిని మరింత దిగజార్చాయని చెప్పారు. కానీ ఏడాది చివరి త్రైమాసికం నాటికి పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే కొద్ది నెలల్లో వోక్స్‌వ్యాగన్ ఇండియా కార్ల వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. వోక్స్‌వ్యాగన్ ఫ్లాగ్‌షిప్ వేరియంట్ టిగువాన్ కోసం వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం దాదాపు ఐదు నెలలు ఉంది. సప్లై చెయిన్ పరిమితుల కారణంగా ఈ గడువు ఎక్కువగా ప్రభావితమవుతుంది.



కంపెనీ విర్టస్ ఆటోమేటిక్ డిమాండ్‌ను 55% వరకు ఊహించగా, అది 65% వరకు పెరిగిందని గుప్తా చెప్పారు. టిగువాన్ డిమాండ్ 55% ఉందన్నారు. 60% మంది 1-లీటర్ వెర్షన్‌ను కొనుగోలు చేస్తే, 40% మంది 1.5-లీటర్‌ను ఇష్టపడుతున్నట్లు వివరించారు. డిమాండ్- సప్లై గ్యాప్‌ తగ్గించేందుకు ఈ మేరకు సర్దుబాట్లు చేస్తామని పేర్కొన్నారు.
Published by:Mahesh
First published:

Tags: Auto News, Budget cars, New model cars, Volkswagen

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు