Home /News /technology /

VOICE CHAT RECORD TO ANIMATED MESSAGES KNOW ABOUT NEW FEATURES ON BETA VERSION 8 OF TELEGRAM SS GH

Telegram 8.0: టెలిగ్రామ్ కొత్త వర్షన్ వచ్చేసింది... ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే

Telegram 8.0: టెలిగ్రామ్ కొత్త వర్షన్ వచ్చేసింది... ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Telegram 8.0: టెలిగ్రామ్ కొత్త వర్షన్ వచ్చేసింది... ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే (ప్రతీకాత్మక చిత్రం)

Telegram 8.0 New Features | అదిరిపోయే ఫీచర్స్‌తో టెలిగ్రామ్ (Telegram) బీటావర్షన్ 8.0 విడుదలైంది. లేటెస్ట్ వర్షన్‌లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకోండి.

ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ ఎప్పటికప్పుడు వినూత్న ఫీచర్లతో కొత్త అప్‌డేట్స్‌ రిలీజ్ చేస్తూ యూజర్లను ఆకర్షిస్తోంది. వాట్సప్‌కు గట్టి పోటీ ఇస్తున్న టెలిగ్రామ్ కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అనేక కొత్త ఫీచర్లతో టెలిగ్రామ్ 8.0 బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్, మ్యాక్ ఓఎస్ యూజర్లు టెలిగ్రామ్ 8.0 బీటా వెర్షన్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ బీటా వెర్షన్‌లో కమ్యూనికేషన్, చాట్‌లు, న్యూస్ ఫీడ్‌ల కోసం మరిన్ని ఆప్షన్లను జోడించారు డెవలపర్లు. ఆ ఆప్షన్స్ ఏవో చూద్దాం.

1. టెలిగ్రామ్ ఛానెల్స్:


మెసెంజర్‌లో రీడ్ చేయని నెక్స్ట్ చాట్/న్యూస్ ఛానెల్‌కు చాలా వేగంగా వెళ్లడానికి ఈ యాప్‌లో ఒక ఆప్షన్ అందించారు. ఒక చాట్ లోని చివరి మెసేజ్ నుంచి నేరుగా మరొక చాట్ లోకి వెళ్లేందుకు పైకి స్వైప్(swipe up) చేస్తే సరిపోతుంది. ఫోల్డర్‌లో లేదా చాట్‌ల జనరల్ లిస్టులో సైతం పైకి స్వైప్ చేసి తదుపరి ఛానళ్లను రీడ్ చేయొచ్చు.

Free Smartphone: ఫ్లిప్‌కార్ట్‌లో ఉచితంగా స్మార్ట్‌ఫోన్... ఆఫర్ రేపటి వరకే

2. హైడ్ సెండర్ నేమ్:


ప్రస్తుతం మనం మెసేజ్ పంపిస్తే అవతల వ్యక్తికి మన పేరు కనిపిస్తుంది. అయితే ఇందులో పేరుని దాచి మెసేజ్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడానికి, సెలెక్ట్ చేసుకున్న చాట్‌లో మెసేజ్‌పై క్లిక్ చేసి Hide Sender's Name ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

3. వాయిస్ చాట్‌ల రికార్డింగ్:


వాయిస్ చాట్‌లను రికార్డ్ చేయడంతోపాటు వీడియో సీక్వెన్స్ ను కూడా రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ మోడ్‌లలో కూడా వీడియో రికార్డ్ చేయవచ్చు. ఇందుకు మీరు వాయిస్ రికార్డ్ చేసే సమయంలో వాయిస్ ఓన్లీ(Voice Only) కాకుండా వీడియో రికార్డ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

Redmi Note 10 Pro Max: రూ.19,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.4,999 ధరకే కొనండి

4. యానిమేట్ మెసేజ్స్:


గ్రేడియింట్ పాలెట్ ను ఉపయోగించి మీరు మెసేజ్ లను పంపించేటప్పుడు వాటి రంగును చేంజ్ చేయొచ్చు. ఈ రంగును చాట్ బబుల్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ కు కూడా అప్లై చేయొచ్చు. చాట్ బబుల్ యానిమేషన్లను కూడా మార్చవచ్చు.

5. ఎమోజీకి సరిపోయే GIFలు:


ఎమోజీ లేదా స్టిక్కర్‌కు బదులుగా ఇదే అర్థంతో GIF పిక్చర్ లను త్వరత్వరగా సెండ్ చేయొచ్చు.

పైన పేర్కొన్న ఫీచర్స్ తో పాటు స్టేటస్ బార్ ద్వారా ‌ స్టిక్కర్‌ను ఎంచుకోవడం, అడ్వర్టైజింగ్ లేబులింగ్ తదితర ఫీచర్లను కూడా పొందొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Telegram

తదుపరి వార్తలు