Jio Effect: 5 ఫోన్ నెంబర్లకు ఒకటే బిల్... వొడాఫోన్ ఆఫర్

Vodafone Red Family Postpaid Plans | మూడు వొడాఫోన్ రెడ్ ఫ్యామిలీ ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

news18-telugu
Updated: June 7, 2019, 6:41 PM IST
Jio Effect: 5 ఫోన్ నెంబర్లకు ఒకటే బిల్... వొడాఫోన్ ఆఫర్
Jio Effect: 5 ఫోన్ నెంబర్లకు ఒకటే బిల్... వొడాఫోన్ ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 7, 2019, 6:41 PM IST
టెలికాం సర్వీస్ ప్రొవైడర్ జియో దెబ్బకు మిగతా టెలికాం కంపెనీలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లను ఆకట్టుకోవడానికి కొత్త ప్లాన్స్‌తో ముందుకొస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఎయిర్‌టెల్ రూ.349, రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ని ప్రకటించింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా RED పోస్ట్‌పెయిడ్ బిల్ ప్లాన్ ఆఫర్స్‌ను ప్రారంభించింది. RED పోస్ట్‌పెయిడ్‌లో నెలకు రూ.598, రూ.749, రూ.999 ప్లాన్స్‌ని ప్రకటించింది వొడాఫోన్. ప్లాన్స్‌ని బట్టి వేర్వేరు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మూడు వొడాఫోన్ రెడ్ ఫ్యామిలీ ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దాంతో పాటు రూ.999 విలువైన అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ 1 ఏడాది, రూ.999 విలువైన Zee5 సబ్‌స్క్రిప్షన్ 1 ఏడాది, రూ.3,000 విలువైన మొబైల్ ఇన్స్యూరెన్స్ ప్యాకేజీ, రూ.499 విలువైన వొడాఫోన్ ప్లే ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి. అంటే ఏడాదిలో సుమారు రూ.5,497 విలువైన బెనిఫిట్స్ పొందొచ్చు. ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.

Vodafone RED 999: వొడాఫోన్ రెడ్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.999 సబ్‌స్క్రైబ్ చేసుకుంటే 5 కనెక్షన్లకు బిల్ షేర్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 200జీబీ 3జీ లేదా 4జీ డేటా లభిస్తుంది. ప్రైమరీ యూజర్‌కు 80 జీబీ, మిగతా నలుగురు యూజర్లకు 30 జీబీ డేటా చొప్పున లభిస్తుంది.

Vodafone RED 749: వొడాఫోన్ రెడ్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.749 సబ్‌స్క్రైబ్ చేసుకుంటే 3 కనెక్షన్లకు బిల్ షేర్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 120జీబీ 3జీ లేదా 4జీ డేటా లభిస్తుంది. ప్రైమరీ యూజర్‌కు 60 జీబీ, సెకండరీ, థర్డ్ యూజర్లకు 30 జీబీ డేటా చొప్పున లభిస్తుంది.

Vodafone RED 598: వొడాఫోన్ రెడ్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.598 సబ్‌స్క్రైబ్ చేసుకుంటే 2 కనెక్షన్లకు బిల్ షేర్ చేసుకోవచ్చు. ఇది మంత్లీ ప్లాన్. 80 జీబీ 3జీ లేదా 4జీ డేటా లభిస్తుంది. ప్రైమరీ యూజర్‌కు 50 జీబీ, సెకండరీ యూజర్‌కు 30 జీబీ డేటా లభిస్తుంది.



Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:
Loading...
Budget 2019 : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు టాప్-10 స్మార్ట్‌ఫోన్లు ఇవే...

World Cup Offer: ఏడాదంతా ప్యారడైజ్ బిర్యానీ ఫ్రీ... కండీషన్స్ అప్లై

Indian Navy Jobs: బీటెక్ చదివితే నేవీలో ఉద్యోగం... రూ.2 లక్షల వరకు జీతం
First published: June 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...