Home /News /technology /

VODAFONE IDEA VI RS 1197 PREPAID PLAN WITH 180 DAYS VALIDITY NOW AVAILABLE TO MORE USERS CHECK BENEFITS SS GH

కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించిన Vodafone Idea... బెనిఫిట్స్ ఇవే

కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించిన Vodafone Idea... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించిన Vodafone Idea... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Vi New Plan | వొడాఫోన్ ఐడియా-Vi మరో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి.

వినియోగదారుల అవసరాలకోసం వొడాఫోన్ ఐడియా-Vi సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. భారత్‌లోని అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్‌ అందుబాటులోకి రానుంది. కస్టమర్లు ఇప్పుడు రూ.1,197 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకొని ఎన్నో ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. My Vi వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ వ్యాలిడిటీ 180 రోజులు. రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు అన్‌లిమిటెడ్ టాక్ టైమ్, రోజుకు 1.5 జీబీ మొబైల్ డేటా, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇప్పటి వరకు రూ.1,197 వీఐ ప్రీపెయిడ్ ప్లాన్ హోమ్ క్రెడిట్ సంస్థ ద్వారా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. 2019 లో వోడాఫోన్ ఐడియా... హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థతో పాట్నర్‌షిప్ ఒప్పందం చేసుకుంది. దీంట్లో భాగంగా కస్టమర్లు రూ.15వేల లోపు ఏదైనా 4G స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటే ఆ సంస్థ ఆర్థిక సహాయం అందిస్తుంది. Vi వినియోగదారుల కోసం ఆ సంస్థ వివిధ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

WhatsApp Trick: సీక్రెట్‌గా వాట్సప్ స్టేటస్ చూడొచ్చు ఇలా

Nokia 2.4: రూ.10,399 ధరకే నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

ఎన్నో ఉపయోగాలు


రూ.1,197 ప్రీపెయిడ్ ప్లాన్‌తో కస్టమర్లు మరిన్ని ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. కంపెనీ గత నెలలో ఆవిష్కరించిన 'వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఫెసిలిటీ కూడా వినియోగదారులకు లభిస్తుంది. డేటా రోల్‌ఓవర్ ప్లాన్ కింద, వీఐ ప్రీపెయిడ్ కస్టమర్లు వారం మొత్తంలో మిగిల్చుకున్న డేటాను వీకెండ్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్తో Viమూవీస్ & టీవీని కస్టమర్లు ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు. Vi వినియోగదారులు Android, iOS ఓఎస్‌లతో పనిచేసే డివైజ్‌లలో Vi మొబైల్ యాప్ ద్వారా లేదా Viమూవీస్, TV వెబ్‌సైట్ ద్వారా వివిధ టీవీ షోలు, సినిమాలను యాక్సెస్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సర్వీస్ మాదిరిగానే వీఐ ఈ సదుపాయాలను తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Moto E7: మోటోరోలా నుంచి తక్కువ ధరలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్

రోజూ 3జీబీ డేటా ఇచ్చే Jio, Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే...

ఆ ప్లాన్లకు ఆదరణ


ప్రస్తుతానికి 180 రోజుల వ్యాలిడిటీతో రూ.1,197 ప్రీపెయిడ్ ప్లాన్ ఒక్కటే అందుబాటులో ఉంది. రూ.2,595, రూ.2,399 వంటి ప్లాన్ల ద్వారా కస్టమర్లు అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు. ఇవి మాత్రమే 180 రోజుల కన్నా ఎక్కువ వ్యాలిడిటీతో లభిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 365 రోజులు (ఒక సంవత్సరం). రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉండే బెనిఫిట్లే రూ.1,197 ప్రీపెయిడ్ ప్లాన్‌తో కూడా పొందవచ్చు. ఈ రెండింటికీ వ్యాలిడిటీ ఒక్కటే తేడా. రూ.2,595 ప్రీపెయిడ్ ప్లాన్తో రోజుకు 2GB డేటాతో పాటు ఒక సంవత్సరం వరకు ఉచితంగా ZEE5 ప్లాట్‌ఫామ్‌ మెంబర్‌షిప్ లభిస్తుంది. Vi ప్రీపెయిడ్ కస్టమర్లు Vi వెబ్‌సైట్, యాప్ లేదా అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా 1,197 రూపాయల ప్లాన్‌ను యాక్సెస్ చేయవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: IDEA, VODAFONE, Vodafone Idea

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు