• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • VODAFONE IDEA VI LAUNCHED RS 447 PREPAID PLAN WITH 5GB DATA AND 60 DAYS VALIDITY SS GH

Vi Prepaid Plan: వొడాఫోన్​ నుంచి రూ.447 ప్రీపెయిడ్​ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

Vi Prepaid Plan: వొడాఫోన్​ నుంచి రూ.447 ప్రీపెయిడ్​ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

Vi Prepaid Plan | వొడాఫోన్ ఐడియా-Vi కస్టమర్లకు గుడ్ న్యూస్. రూ.447 ప్లాన్‌ను ప్రకటించింది వొడాఫోన్ ఐడియా. బెనిఫిట్స్ తెలుసుకోండి.

  • Share this:
కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు పోటీపోటీగా కొత్త కొత్త ప్లాన్లు, ఆఫర్లను తీసుకొస్తున్నాయి. తాజాగా Vi (వొడాఫోన్ ఐడియా) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్​ చేసింది. రూ. 447 విలువ గల ఈ ప్లాన్​ కింద 50GB డేటాను అందిస్తుంది. 60 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్​ కింద అనేక బెనిఫిట్స్​ అందజేస్తుంది. ఈ ప్లాన్ కింద వచ్చే డేటాపై​ రోజూవారి పరిమితి పెట్టకపోవడం విశేషం. భారత టెలికాం మార్కెట్​లో వొడాఫోన్​కు గట్టి పోటీనిస్తోన్న రిలయన్స్ జియో, ఎయిర్​టెల్​ కూడా ఇటీవల ఇదే తరహా ప్లాన్లను లాంచ్ చేశాయి. అచ్చం ఇవే బెనిఫిట్స్​తో ఎయిర్​టెల్​ రూ. 456, రిలయెన్స్​ జియో రూ. 447 ప్లాన్లను ఇటీవల విడుదల చేశాయి.

Vi (వొడాఫోన్​ ఐడియా) సంస్థ కొత్తగా విడుదల చేసిన ప్లాన్​ బెనిఫిట్స్​ను పరిశీలిస్తే.. ఇది రోజువారి డేటా పరిమితి లేకుండా 50 జీబీ బల్క్​ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్​ ద్వారా అన్​లిమిటెడ్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎమ్​ఎస్​ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్ 60 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. దీంతో పాటు వీఐ మూవిస్​కు ఉచిత యాక్సెస్​ కూడా లభిస్తుంది. ఇందులో ఒరిజినల్​ కంటెంట్​, లైవ్​ టీవీ, న్యూస్​ కంటెంట్​ను కూడా యాక్సెస్​ చేయవచ్చు. వీఐ యాప్​ ద్వారా ఈ ప్రీపెయిడ్​ ప్లాన్​కు సంబంధించిన బెనిఫిట్స్​, మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

Reliance AGM 2021: జియోఫోన్ నెక్స్‌ట్, జియో 5జీ సొల్యూషన్... మరెన్నో సేవలు

Realme Narzo 30 5G: తక్కువ ధరకే మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన రియల్‌మీ

రోజువారీ డేటాపై నో లిమిట్​


రిలయన్స్​​ జియో కూడా అదే ధరలో ఇవే బెనిఫిట్స్​ అందిస్తుంది. 60 రోజుల వ్యాలిడిటీతో 50 జీబీ డేటా ఇస్తుంది. ఈ 50 జీబీ డేటా లిమిట్​ పూర్తయ్యాక.. ఈ డేటా స్పీడ్​ 64Kbps కి పడిపోతుంది. మరోవైపు, ఈ బెనిఫిట్స్​తో పాటు జియో ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్​, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్​ వంటి జియో యాప్స్​కు ఫ్రీ యాక్సెస్​ లభిస్తుంది. ఇక, జియో రూ. 447 ప్లాన్​కు పోటీగా.. ఎయిర్​టెల్​ కూడా రూ. 456 ప్లాన్​ ప్లాన్​ లాంచ్​ చేసంది. జియో, వొడాఫోన్​ తరహాలోనే ఈ ప్లాన్​ కూడా అన్ని బెనిఫిట్స్ అందిస్తుంది. డేటా లిమిట్​ పూర్తయ్యాక కూడా నెట్ యాక్సెస్​ కావాలంటే.. ప్రతి ఎంబికి 50 పైసలు ఆటో డిడక్ట్ అవుతుంది. ఇక, రోజుకు 100 ఎస్​ఎంఎస్​ లిమిట్​ పూర్తయ్యాక.. ప్రతి లోకల్ ఎస్​ఎంఎస్​కు రూ. 1, ప్రతి నేషనల్​ ఎస్​ఎంఎస్​కు 1.5 అదనంగా చెల్లించాలి.

Redmi Note 10: ఈ స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే

Dual WhatsApp: ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోండి ఇలా

ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ. 456 ప్రీపెయిడ్​ ప్లాన్​లో భాగంగా 30 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్రీ సబ్​స్క్రిప్షన్ అందిస్తుంది. దీనితో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్‌, ఫ్రీ హలో ట్యూన్స్​కు యాక్సెస్​ కూడా లభిస్తుంది. వీటికి అదనంగా ఫాస్ట్‌టాగ్‌ రీచార్జ్​లో రూ.100 క్యాష్‌బ్యాక్, షా అకాడమీ ఆన్‌లైన్ కోర్సులకు ఫ్రీ ఎంట్రీ వంటి అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: