వొడాఫోన్ ఐడియా-Vi నుంచి కొత్త ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

Vi RedX Family Postpaid Plan | మీరు వొడాఫోన్ ఐడియాలో కొత్త ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే Vi రెడ్ఎక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకోండి.

news18-telugu
Updated: December 3, 2020, 1:27 PM IST
వొడాఫోన్ ఐడియా-Vi నుంచి కొత్త ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
వొడాఫోన్ ఐడియా-Vi నుంచి కొత్త ప్లాన్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిలయెన్స్ జియో, ఎయిర్టెల్ నెట్వర్క్‌లకు గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వరుస ఆఫర్లను ప్రకటిస్తుంది వొడాఫోన్ ఐడియా-Vi. దీనిలొ భాగంగా ప్రత్యేక ప్రయోజనాలతో ప్రీపెయిడ్‌తో పాటు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. తాజాగా వినియోగదారులకు ఆకట్టుకునేందుకు రూ .1,348 ధరతో కూడిన కొత్త రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఇద్దరు సభ్యుల మధ్య పంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లో చేరిన ఇద్దరూ ఉచిత అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్‌తో పాటు నెలకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యాన్ని ఆనందించవచ్చు. రూ.1,348 రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్‌లో ఇదివరకే అమల్లో ఉన్న రూ.999, రూ.799, రూ.649 విలువైన ప్లాన్లలో వచ్చే బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. తాజా Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ భారతదేశంలోని ఎంపిక చేసిన సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రాబోయే నెలల్లో ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ను భారతదేశంలోని అన్ని నగరాలకు విస్తరిస్తామని వీఐ పేర్కొంది.

WhatsApp New Features: వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ బుకింగ్ చాలా సింపుల్... చేయండి ఇలా

ఏడాది పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం


రూ.1,348 విలువ చేసే రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రైమరీ మెంబర్ అదనపు బెనిఫిట్ కింద రూ.5,988 విలువ చేసే నెట్‌ఫ్లిక్స్, రూ.999 విలువ చేసే అమెజాన్ ప్రైమ్, ZEE5 ఏడాది సభ్యత్వాన్ని పొందుతారు. వీటితో పాటు ప్రైమరీ మెంబర్‌కు అపరిమిత మొబైల్ ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తుంది. సెకండరీ యూజర్కి 30GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఒకవేళ సెకండరీ యూజర్ అదనపు డేటా కావాలనుకుంటే ప్రతి జిబికి రూ.20 చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుంది. సెకండరీ యూజర్ కోసం 50GB వరకు డేటా రోల్ఓవర్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. Vi రెడ్ఎక్స్ ప్లాన్ కింద ఇదివరకే రూ .649 ప్లాన్ అమల్లో ఉంది. ఇది ఇద్దరు సభ్యుల మధ్య భాగస్వామ్యం చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. రూ.649తో, ఇద్దరు సభ్యులు నెలకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు అపరిమిత లోకల్, ఎస్‌టిడి కాల్‌లను ఆస్వాదించవచ్చు. డేటా పరంగా చూస్తే ప్రాధమిక సభ్యుడు 50GB డేటాను, ద్వితీయ సభ్యుడు 30GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో డేటా రోల్‌ఓవర్, Vi మూవీస్ & టీవీకి సంవత్సరం పాటు యాక్సిస్‌తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాగా, ఈ ప్లాన్ ప్రాథమిక సభ్యుడు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌లను ఒక సంవత్సరం పాటు ఉచితంగా పొందుతారు.
Published by: Santhosh Kumar S
First published: December 3, 2020, 1:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading