Vi New Plans: వొడాఫోన్ ఐడియా నుంచి సరికొత్త ప్లాన్స్... డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితం

Vi New Plans: వొడాఫోన్ ఐడియా-Vi నుంచి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్... డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం (ప్రతీకాత్మక చిత్రం)

Vi New Plans | వొడాఫోన్ ఐడియా-Vi యూజర్లకు శుభవార్త. సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది వొడాఫోన్ ఐడియా-Vi. ఈ ప్లాన్స్ రూ.401 నుంచి మొదలవుతాయి.

  • Share this:
    వొడాఫోన్ ఐడియా-Vi  కొత్త ప్లాన్స్ ప్రకటించింది. రూ.401, రూ.501, రూ.601, రూ.801 ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ నాలుగు ప్లాన్స్‌పై రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి. అంతేకాదు... పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌కి కూడా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది వొడాఫోన్ ఐడియా-Vi. రూ.499 కన్నా ఎక్కువ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌కు ఈ స్ట్రీమింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇక ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు హైస్పీడ్ నైట్‌టైమ్ ఇంటర్నెట్, వీకెండ్ డేటా రోల్ ఓవర్ బెనిఫిట్, డబుల్ డేటా ఆఫర్స్ లాంటి ఇటీవల వొడాఫోన్ ఐడియా-Vi ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు హాస్పిటల్ కేర్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా రూ.401, రూ.501, రూ.601, రూ.801 ప్లాన్స్ ప్రకటించింది. మరి ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.

    Vi Rs 401 Plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 16జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 100జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. వీటితో పాటు ఏడాది డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. హైస్పీడ్ నైట్‌టైమ్ ఇంటర్నెట్, వీకెండ్ డేటా రోల్ ఓవర్ బెనిఫిట్, వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ కూడా లభిస్తాయి.

    Samsung Galaxy M12: భారీ బ్యాటరీతో రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం12... ఫీచర్స్, ఆఫర్స్ వివరాలివే

    WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మీ ఛాట్స్‌కి పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు

    Vi Rs 501 Plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.501 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 75జీబీ డేటా లభిస్తుంది. ఏడాది డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తాయి.

    Vi Rs 601 Plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.601 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 168జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 16జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 184జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. వీటితో పాటు ఏడాది డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. హైస్పీడ్ నైట్‌టైమ్ ఇంటర్నెట్, వీకెండ్ డేటా రోల్ ఓవర్ బెనిఫిట్, వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ కూడా లభిస్తాయి.

    WhatsApp: వాట్సప్‌లో ఈ 7 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి... ఎలా వాడుకోవచ్చంటే

    Aarogya Setu App: కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలా? ఆరోగ్య సేతు యాప్‌లో స్లాట్ బుక్ చేయండి ఇలా

    Vi Rs 801 Plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.801 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 252జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 16జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 268జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. వీటితో పాటు ఏడాది డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. హైస్పీడ్ నైట్‌టైమ్ ఇంటర్నెట్, వీకెండ్ డేటా రోల్ ఓవర్ బెనిఫిట్, వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ కూడా లభిస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published: