Vodafone Offer: వొడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.20 రీఛార్జ్ చేస్తే చాలు

Vodafone Offer | రూ.20 రీఛార్జ్ చేసిన వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 28 రోజుల వేలిడిటీతో పాటు టాక్‌టైమ్ లభిస్తుంది. గతంలో రూ.35 రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ వచ్చేది.

news18-telugu
Updated: September 3, 2019, 1:30 PM IST
Vodafone Offer: వొడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.20 రీఛార్జ్ చేస్తే చాలు
Vodafone Offer: వొడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.20 రీఛార్జ్ చేస్తే చాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు వొడాఫోన్ సిమ్ కార్డ్ వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. మినిమమ్ రీఛార్జ్‌ను భారీగా తగ్గించింది వొడాఫోన్. గతంలో రూ.35 ఉన్న కనీస రీఛార్జ్‌ను రూ.20 కి తగ్గించింది. ఇటీవల వొడాఫోన్ ఐడియా మినిమమ్ రీఛార్జ్ అమౌంట్‌ను భారీగా తగ్గిస్తూ వస్తోంది. ఎవరైనా తమ సిమ్ కార్డ్ వేలిడిటీ కొనసాగించాలంటే మినిమమ్ రీఛార్జ్ చేయించడం తప్పనిసరి. అయితే గతంలో మినిమమ్ రీఛార్జ్ రూ.35 ఉండేది. ఇప్పుడు ఆ రీఛార్జ్‌ను రూ.20 కి తగ్గించింది వొడాఫోన్. మార్కెట్‌లో పట్టు కోల్పోకుండా ఉండటంతో పాటు యూజర్ బేస్‌ తగ్గకుండా చూసేందుకు వొడాఫోన్ ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తోంది. మినిమమ్ రీఛార్జ్ ద్వారా వొడాఫోన్ ఐడియాకు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్-ARPU పెరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి.

రూ.20 రీఛార్జ్ చేసిన వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 28 రోజుల వేలిడిటీతో పాటు టాక్‌టైమ్ లభిస్తుంది. గతంలో రూ.35 రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ వచ్చేది. వేలిడిటీ రెండు రోజులు తగ్గినా రీఛార్జ్ ప్లాన్‌పై మాత్రం భారీ తగ్గింపు లభించినట్టే. రిలయెన్స్ జియో దెబ్బకు టెలికామ్ కంపెనీలన్నీ రీఛార్జ్ ప్లాన్స్ ధర తగ్గిస్తున్న విషయం తెలిసిందే. వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ ఎయిర్‌టెల్ కూడా డేటా, కాలింగ్ ధరల్ని భారీగా తగ్గిస్తోంది.

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Discount: ఆ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.12,000 డిస్కౌంట్

WhatsApp Features: ఈ 4 ఫీచర్లు వస్తే మీ వాట్సప్ అదిరిపోవడం ఖాయం
Loading...
August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి
First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...