హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Free Data: 75 జీబీ డేటా ఉచితం.. ఈ సిమ్ కార్డు వాడే వారికి బంపరాఫర్!

Free Data: 75 జీబీ డేటా ఉచితం.. ఈ సిమ్ కార్డు వాడే వారికి బంపరాఫర్!

 Free Data: 75 జీబీ డేటా ఉచితం.. ఈ సిమ్ కార్డు వాడే వారికి బంపరాఫర్!

Free Data: 75 జీబీ డేటా ఉచితం.. ఈ సిమ్ కార్డు వాడే వారికి బంపరాఫర్!

Phone Recharge | టెలికం కంపెనీ తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అదనపు డేటా ప్రయోజనాన్ని కల్పిస్తోంది. ఏకంగా 75 జీబీ డేటా వరకు ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Mobile Recharge | ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న వొడాఫోన్ ఐడియా అదిరే ఆఫర్ తీసుకువచ్చింది. కస్టమర్లకు ఉచితంగానే 75 జీబీ డేటాను అందిస్తోంది. అయితే కొత్తగా రీచార్జ్ (Recharge) చేసుకునే వారికే ఈ ఆఫర్ (Offer) వర్తిస్తుంది. కంపెనీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 20 వరకే ఉంటుంది. ఎంపిక చేసిన రీచార్జ్ ప్లాన్లపైనే ఈ ఉచిత డేటా ఆఫర్ అందుబాటులో ఉంది. ఏ ఏ ప్లాన్లపై ఉచితంగా డేటా పొందొచ్చొ తెలుసుకుందాం.

3099 ప్లాన్ ఒకటి ఉంది. ఈ ప్లాన్ కింద రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 20 జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా డిస్నీ హాట్ ‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు వస్తుంది. ఇంకా బింగ్ ఆల్ నైట్ డేటా, వీకెండ్ డేటా రోలోవర్ వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు.

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఇలా

ఇంకా రూ. 2899 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ ఏడాది. ఇందులో భాగంగా యూజర్లకు రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ కింద కంపెనీ 75 జీబీ అదనపు డేటా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అపరిమిత కాలింగ్ ఫెసిలిటీ ఉంది. ఈ ప్లాన్ కింద వీఐపీ సబ్‌స్క్రిప్షన్, వీఐ మూవీస్, టీవీ యాప్ వంటివి పొందొచ్చు.

అకౌంట్‌లోకి ఉచితంగా రూ.1,02,000 పొందండిలా, కేంద్రం అదిరే ఆఫర్!

ఇంకా రూ. 1799 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ కింద 24 జీబీ డేటా పొందొచ్చు. దీని వాలిడిటీ ఏడాది. అదనంగా 10 జీబీ డేటా వస్తుంది. అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇంకా రూ. 1449 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. అదనం 50 జీబీ డేటా పొందొచ్చు. పరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు. ఈ ప్లాన్ కింద వీఐ మూవీస్, టీవీ యాప్, డేటా రోలోవర్, బింగ్ ఆల్ నైట్ వంటి ఇంకా ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందువల్ల వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు రీచార్జ్ చేసుకోవాలని భావిస్తే.. ఈ ప్లాన్స్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. నచ్చిన దానితో రీచార్జ్ చేసుకోవచ్చు. అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు.

First published:

Tags: Mobile recharge, Recharge, Recharge plans, VODAFONE, Vodafone Idea

ఉత్తమ కథలు