Vi Plans | టెలికం కంపెనీలు జియో (Jio), ఎయిర్టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. దీంతో కంపెనీలు పోటీ పడి మరీ అదిరిపోయే ప్లాన్స్ అందిస్తున్నాయి. ప్రిపెయిడ్ ప్లాన్ల కన్నా పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌పై అదిరే బెనిఫిట్స్ లభిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మనం బెస్ట్ రీచార్జ్ ప్లాన్లలో ఒకటిగా కొనసాగుతున్న 401 ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు ఈ 401 రీచార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇది పోస్ట్ పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్‌లో భాగంగా అదిరిపోయే బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఉచిత డేటా, ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
రోజుకు రూ.70 పొదుపు చేస్తే రూ.48 లక్షలు పొందొచ్చు! ఈ ఎల్ఐసీ స్కీమ్ గురించి తెలుసా?
వొడాఫోన్ ఐడియా 401 రీచార్జ్ ప్లాన్‌లో 50 జీబీ డేటాను అదనంగా పొందొచ్చు. అయితే ఈ ప్లాన్‌ను ఆన్లైన్ ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే ఈ 50 జీబీ ఉచిత డేటా వస్తుంది. అంతేకాకుండా 200 జీబీ వరకు డేటా రోలోవర్ ప్రయోజనం కూడా ఉంది. ఇంకా ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ బెనిఫిట్ లభిస్తుంది. నెలకు 3000 ఎస్ఎంఎస్లు పంపే అవకాశం ఉంటుంది.
సర్ప్రైజ్ ఆఫర్.. 200MP కెమెరా ఫోన్‌పై ఏకంగా రూ.35 వేల డిస్కౌంట్!
అంతేకాకుండా వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ 401 ప్లాన్‌లో ఇంకా అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమితి డేటా లబిస్తుంది. 12 నెలలు సోనీ లివ్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. వీఐ మూవీస్, టీవీ యాప్ వీఐపీ యాక్సెస్ పొందొచ్చు. జీ5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఆరు నెలలు హంగామా యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. వీఐ యాప్ బెనిఫిట్స్ లభిస్తాయి.
ఇలా వొడాఫోన్ ఐడియా 401 రీచార్జ్ ప్లాన్‌తో కస్టమర్లు అదిరిపోయే ప్రయోజనాలు పొందొచ్చు. మీరు కూడా ఈ ప్లాన్ పొందాలని భావిస్తే.. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. సిమ్ కార్డు లేకపోతే ఆన్లైన్లోనే ఆర్డర్ ఇవ్వొచ్చు. ఇలా మీరు వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ ప్రయోజనాన్ని సొంతం చేసుకోవచ్చు. కాగా జియో , ఎయిర్టెల్ వంటి కంపెనీలు కూడా కస్టమర్లకు పోస్ట్ పెయిడ్, ప్రిపెయిడ్ ప్లాన్లపై ఓటీటీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తున్నాయి. అన్ని ప్లాన్ల ను చెక్ చేసుకొని ఎందులో మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఒక అంచనాకు వచ్చిన తర్వాత రీచార్జ్ చేసుకోవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airtel recharge plans, Jio, Recharge, Reliance Jio, Vodafone Idea