VI Recharge Plans | ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా (VI) తాజాగా కొన్ని కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ధరను గమనిస్తే పాత ప్లాన్స్ కన్నా ఎక్కువగా ఏమీ లేదు. ఈ కొత్త ప్లాన్స్ ధర కేవలం రూ. 2 ఎక్కువగా ఉంది. పాత ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులో లేవు. అయితే కొత్త ప్లాన్స్‌తో (VI Plans) కస్టమర్లకు ఎక్కువ బెనిఫిట్స్ అందుబాటులోకి వచ్చాయి.
వొడాఫోన్ ఐడియా కొత్తగా తెచ్చిన రీచార్జ్ ప్లాన్స్‌లో 501 ప్లాన్ కూడా ఒకటి. ఇప్పుడు దీన్ని ఎయిర్టెల్ రూ.499 ప్లాన్‌తో పోల్చి చూస్తే.. ఎలాంటి వ్యత్యాసం ఉందో తెలుసుకుందాం. పోస్ట్ పెయిడ్ విభాగంలో ఎయిర్‌టె, వొడాఫోన్ ఐడియా ఒకదానిలో ఒకటి పోటీపడుతున్న విషయం తెలసిందే.
వచ్చే వారంలో బ్యాంకులు 3 రోజులు పని చేయవు.. ఎప్పుడెప్పుడంటే?
ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ 499 ప్లాన్‌ను తీసుకుంటే.. ఈ ప్లాన్‌లో 75 జీబీ డేటా వస్తుంది. 200 జీబీ డేటా వరకు రోలోవర్ బెనిఫిట్ ఉంది. అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 రోజులు వస్తాయి. అమెజాన్ ప్రైమ్ 6 నెలలు, డిస్నీ హాట్‌స్టార్ మొబైల్ ఏడాది పాటు పొందొచ్చు. హ్యాండ్సెట్ ప్రొటెక్షన్, వింక్ ప్రీమియం వంటి సర్వీసులు కూడా లభిస్తాయి.
అమేజింగ్ ఆఫర్.. రూ.15,999కే 50 అంగుళాల స్మార్ట్ టీవీ!
వొడాఫోన్ ఐడియా రూ.501 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను గమనిస్తే.. ఈ ప్లాన్‌లో 90 జీబీ డేటా పొందొచ్చు. ఇంకా 50 జీబీ అదనపు డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్ పొందొచ్చు. 200 జీబీ డేటా వరకు రోలోవర్ బెనిఫిట్ ఉంది. నెలకు 3 వేల ఎస్ఎంఎస్లు పంపొచ్చు. అమెజాన్ ప్రైమ్ 6 నెలలు ఉచితంగా వస్తుంది. డిస్నీ హాట్ స్టాన్ ఏడాది పాటు ఫ్రీగా చూడొచ్చు. ఆరు నెలలు వీఐ యాప్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటా లభిస్తుంది.
పైన పేర్కొన్న ధరలకు జీఎస్టీ , ఇతర ట్యాక్స్‌లు వంటివి అదనం. ఈ రెండు ప్లాన్స్‌లో వొడాఫోన్ ఐడియా ప్లాన్ ఎక్కువ డేటా అందిస్తోందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాత్రి పూట అపరిమిత డేటా పొందొచ్చు. రాత్రి పూట సినిమాలు ఎక్కువగా చూసే వారు వొడాఫోన ఐడియా ప్లాన్‌తో ఎక్కువ లాభం సొంతం చేసుకోవచ్చు. అయితే ఎయిర్టెల్ ప్లాన్‌లో అదనపు కనెక్షన్ పొందొచ్చు. దీని కోసం రూ. 299 చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఏ ప్లాన్ బెస్ట్‌గా ఉందో మీరే నిర్ణయించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Airtel recharge plans, Vodafone Idea