Vi Plans | ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా కొత్త రీచార్జ్ ప్లాన్స్ (Recharge Plans) తీసుకువచ్చింది. ఇవి వార్షిక రీచార్జ్ ప్లాన్స్. అంటే ఏడాది పాటు వాలిడిటీ ఉంటుంది. వీటిల్లో రూ. 2,999 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన వాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అపరిమిత వాయిస్ కాల్స్ పొందొచ్చు. అలాగే 850 జీబీ డేటా వస్తుంది. ఈ డేటా అయిపోయిన తర్వాత ఒక్కో ఎంబీ డేటాకు 50 పైసలు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా అపరిమిత డేటా (Data) సదుపాయం ఉంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉచితంగా డేటా పొందొచ్చు.
వొడాఫోన్ రూ. 2,999 ప్లాన్‌లో 100 ఎస్ఎంఎస్లు రోజుకు పంపొచ్చు. ఈ లిమిట్ దాటితే ఒక్కో ఎస్ఎంఎస్కు ఒక రూపాయి కట్ అవుతుంది. అదే ఎస్టీడీ అయితే రూ. 1.5 కట్ అవుతుంది. అయితే ఈ ప్లాన్‌పై ఎలాంటి ఓటీటీ బెనిఫిట్స్ ఉండవు. వీఐ మూవీస్, టీవీ బేసిక్ యాక్సెస్ మాత్రమే లభిస్తాయి.
రూ.10 లక్షలకు రూ. 20 లక్షలు.. మీ డబ్బు రెట్టింపు చేసే స్కీమ్స్ ఇవే!
అలాగే రెండో ప్లాన్ విషయానికి వస్తే రూ. 2899 ప్లాన్. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా ఏడాది. ఇంకా ఈ ప్లాన్‌లో కూడా అపరిమిత ఉచిత డేటా బెనిఫిట్ ఉంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 వరకు ఉచితంగా డేటా లభిస్తుంది. ఇంకా వీకెండ్ డేటా రోలోవర్ సదుపాయం ఉంది. అలాగే 2 జీబీ బ్యాకప్ డేటా ప్రతి నెలా లభిస్తుంది. దీనికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన పని లేదు.
ఎలక్ట్రిక్ బైక్ అదిరింది.. రూ.2తో 150 కిలోమీటర్లు వెళ్లొచ్చు, ధర రూ.10 వేలు!
ఈ ప్లాన్స్ మాత్రమే కాకుండా మరో ప్లాన్ కూడా ఉంది. 3099 ప్లాన్ కూడా ఒకటుంది. ఇది కూడా వార్షిక రీచార్జ్ ప్లాన్. ఇందులో రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ హీరో బెనిఫిట్ పొందొచ్చు. ఏడాది పాటు డిస్నీ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. కాగా ఈ టెలికం కంపెనీ ఇటీవల నాలుగు కొత్త ఇంటర్నేషనల్ రోమిండ్ ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. ఫిపా వరల్డ్ కప్ నేపథ్యంలో వీటిని ఆవిష్కరించింది. రూ. 2999, రూ. 3999, రూ. 4499, రూ. 5999 ప్లాన్స్ అనేవి ఇవి. ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఈ ప్లాన్స్ వర్తిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Recharge, VODAFONE, Vodafone Idea