Vodafone Idea కొత్త ఆఫర్.. డేటా యూజర్లు ఫుల్ ఖుష్..!!

ప్రముఖ టెలికాం నెట్వర్క్ కంపెనీలు వొడాఫోన్, ఐడియా ఇటీవలే ‘వీఐ’ పేరుతో ఒక్కటైన విషయం తెలిసిందే. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ‘వీఐ’ తాజాగా డేటా రోల్ఓవర్ ఆఫర్ తో ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను ‘వీఐ’ తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది.

news18
Updated: October 20, 2020, 3:04 PM IST
Vodafone Idea కొత్త ఆఫర్.. డేటా యూజర్లు ఫుల్ ఖుష్..!!
File Image
  • News18
  • Last Updated: October 20, 2020, 3:04 PM IST
  • Share this:
ప్రముఖ టెలికాం నెట్వర్క్ కంపెనీలు వొడాఫోన్, ఐడియా ఇటీవలే ‘వీఐ’ పేరుతో ఒక్కటైన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర సమయంలో వర్క్ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘వీఐ’ తాజాగా డేటా రోల్ఓవర్ ఆఫర్ తో ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను ‘వీఐ’ తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది.
ఈ నూతన ఆఫర్లో భాగంగా వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు క్రిందటి వారంలో ఉపయోగించని డేటా తర్వాతి వారానికి బదిలీ చేయబడుతుంది. అయితే, ఈ వారాంతపు డేటా రోల్ఓవర్ ఆఫర్ కేవలం అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్లను సబ్ స్క్రైబ్ చేసుకున్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ ఆఫర్ ను పొందాలంటే వినియోగదారుడు రూ .249 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ‘వీఐ’ ప్రీపెయిడ్ కస్టమర్లు వారి ప్రీపెయిడ్ ప్లాన్లో భాగంగా పరిమిత మొబైల్ డేటాను మాత్రమే వాడుకునే అవకాశం ఉంది. వినియోగదారుడు తాము ఆ రోజు ఉపయోగించని డేటా మరుసరి రోజుకు బదిలీ అయ్యే అవకాశం ఉండేది కాదు.

Vodafone Idea, Prepaid Customers, Data Rollover

కానీ, ఈ నూతన డేటా రోల్ఓవర్ ఆఫర్ కింద చేరిన వినియోగదారులు తాము ఉపయోగించని డేటాను సైతం ఆస్వాదించగలుగుతారు.
రూ. 249 నుంచి రూ. 2,595 వరకు ఉండే అన్లిమిటెడ్ ప్లాన్లన్నింటికీ ఈ డేటా రోల్ఓవర్ ఆఫర్ వర్తిస్తుంది. రూ. 249, రూ. 399, రూ.599 వంటి అన్లిమిటెడ్ ప్లాన్లను ‘వీఐ’ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే 5జీబీ అదనపు డేటాతో పాటు వారాంతపు డేటా రోల్ఓవర్ ఆఫర్ను కూడా పొందొచ్చు.

డేటా రోల్ఓవర్ ప్లాన్ లో చేరిన వినియోగదారులు వీఐ మొబైల్ యాప్లోని యాక్టివ్ ప్యాక్స్ & సర్వీసెస్ విభాగానికి వెళ్లి లేదా ఎస్ఎస్డీ కోడ్ * 199 # ను ఉపయోగించి ప్రస్తుతం ఉన్న డేటాను చెక్ చేసుకోవచ్చు. ఈ డేటా రోల్ఓవర్ ఆఫర్ 2021 జనవరి 17 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.
Published by: Srinivas Munigala
First published: October 20, 2020, 3:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading