ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా(Vi) ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం నాలుగు కొత్త ప్లాన్లతో ముందుకు వచ్చింది. కొత్త Vi ప్లాన్ ధరలు రూ.155, రూ.239, రూ.666 మరియు రూ.699. ఈ ప్లాన్లన్నీ Vi అధికారిక వెబ్సైట్ మరియు మొబైల్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. రూ. 250 కంటే తక్కువ ధర గల ప్లాన్ల కోసం చూస్తున్న కస్టమర్లు రూ.155 మరియు రూ.239 ప్లాన్లను ఇష్టపడే అవకాశం ఉంది. వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్లపై టారిఫ్ పెంపుదల ప్రకటించిన కొన్ని వారాల తర్వాత కొత్త ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి. వోడాఫోన్‌తో పాటు, రిలయన్స్ జియో కూడా ఇటీవల తన వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో రూ. 1 రీఛార్జ్ ప్లాన్ కూడా ఉండడం విశేషం.ఈ ప్లాన్లు అన్ని టెలికాం సర్కిల్‌లలో అందుబాటులో ఉన్నాయి.
Vi యొక్క కొత్త ప్లాన్ ల వివరాలు..
1. Vi Rs.155 Plan: ఈ ప్లాన్ 24 రోజుల వాలిడిటీని కలిగి ఉంటుంది. ఇంకా 1 GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. 300 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు.
2. Vi Rs.239 Plan: ఈ కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్ కూడా 24 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. అయితే 1GBకి బదులుగా రోజుకు 1GB డేటా ఈ ప్లాన్‌లో లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ప్రతిరోజూ 100 SMSలను పంపించుకోవచ్చు.
Jio 1.5GB Data plans: జియో యూజర్లకు రోజూ 1.5జీబీ డేటా ఇచ్చే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే
3. Vi Rs. 666 Plan: ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 1.5 GB డేటా లభిస్తుంది. ఇంకా 77 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత కాలింగ్‌తో రోజు 100 SMSలను పంపించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో రాత్రిపూట అపరిమిత వీడియో స్ట్రీమింగ్, వారాంతపు డేటా రోల్ఓవర్ వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి.
4.Vi Rs. 699 Plan: డైలీ డేటా ఎక్కువగా వాడే వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో మీరు డైలీ 3 GB డేటాను పొందుతారు. ఇంకా అపరిమిత కాలింగ్ సదుపాయం లభిస్తుంది. మరియు రోజుకు 100 SMSలను పంపించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Jio, Recharge, VODAFONE, Vodafone Idea