Vi Plans | దేశంలోని మూడో అతిపెద్ద టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. రెండు కొత్త ప్రిపెయిడ్ ప్లాన్స్ తెచ్చింది. వీటి ధర రూ. 25 నుంచి ఉంది. ఒక ప్లాన్ రేటు రూ. 25 అయితే మరో ప్లాన్ ధర రూ. 55గా ఉంది. ఇవి 4జీ డేటా (Data) వోచర్స్. అంటే కస్టమర్లు ఈ ప్లాన్స్ పొందాలని భావిస్తే.. బేస్ ప్లాన్ కచ్చితంగా కలిగి ఉండాలి. అప్పుడు ఈ ప్లాన్స్‌ను పొందగలం. బేస్ ప్రిపెయిడ్ ప్లాన్ లేకపోతే ఈ ప్లాన్స్‌తో రీచార్జ్ చేసుకున్నా కూడా డేటా రాదు. అందువల్ల ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
కాగా వొడాఫోన్ ఐడియా నెల ఆరంభంలో రూ. 75తో 4జీ డేటా వోచర్‌ను తీసుకువచ్చింది. ఈ రూ. 75 డేటా ప్లాన్‌తో కస్టమర్లకు 6 జీడీ డేటా వస్తుంది. దీని వాలిడిటీ 7 రోజులు ఉంటుంది. ఇప్పుడు మనం రూ. 25 ప్లాన్, రూ. 55 ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ వాలిడిటీ, బెనిఫిట్స్ వంటివి ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం.
రూ.1,399కే విమాన టికెట్.. 2 రోజులే ఆఫర్!
రూ. 25 డేటా వోచర్ విషయానికి వస్తే.. ఇందులో 1.1 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం ఒక్క రోజు మాత్రమే. అంతేకాకుండా కంపెనీ ఒక రోజు వాలిడిటీతో మరో 4జీ డేటా వోచర్ ప్లాన్ అందిస్తోంది. దీని రేటు రూ. 19 మాత్రమే. ఈ ప్లాన్ కింద 1 జీబీ డేటా వస్తుంది. అంటే మీరు 100 ఎంబీ కోసం రూ. 6 ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. అయితే రూ. 25 ప్లాన్‌లో మరో బెనిఫిట్ కూడా ఉంది. వారం రోజులు యాడ్స్ ఫ్రీ మ్యూజిక్ బెనిఫిట్ లభిస్తుంది.
భయపెడుతున్న బంగారం.. కొండెక్కిన ధర!
అంటే వొడాఫోన్ ఐడియా హంగామా మ్యూజిక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వొడాఫోన్ కస్టమర్లకు యాడ్స్ ఫ్రీ మ్యూజిక్ వినే వెసులుబాటు లభిస్తుంది. వీఐ యాప్ ద్వారా అదనపు ఖర్చు లేకుండా ఈ బెనిఫిట్ పొందొచ్చు. యాడ్స్ ఫ్రీ మ్యూజిక్ పొందాలని భావించే వారు రూ. 25తో డేటా వోచర్ పొందొచ్చు. వద్దనుకుంటే రూ. 19తో 4జీ డేటా వోచర్ కొనొచ్చు.
ఇక రూ. 55 5జీ డేటా వోచర్ విషయానికి వస్తే.. దీని కింద కస్టమ్లకు 3.3 జీబీ డేటా వస్తుంది. దీని వాలిడిటీ 7 రోజులు. ఈ ప్లాన్‌లో భాగంగా వొడాఫోన్ ఐడియా నెల రోజుల పాటు యాడ్స్ ఫ్రీ మ్యూజిక్ బెనిఫిట్ అందిస్తోంది. ఈ రూ.55 ప్లాన్‌కు కూడా బేస్ ప్లాన్ ఉండాల్సిందే. లేదంటే పని చేయదు. రూ. 25, రూ. 55 డేటా ప్లాన్స్ మాత్రమే యాడ్స్ ఫ్రీ మ్యూజిక్ ప్రయోజానాన్ని అందిస్తున్నాయి. అంతేకాకుండా రూ. 108 ప్లాన్ కూడా ఉంది. దీని ద్వారా 8 జీబీ డేటా వస్తుంది. వాలిడిటీ 15 రోజులు. ఈ ప్లాన్‌లో కూడా మూడు నెలల యాడ్స్ ఫ్రీ మ్యూజిక్ పొందొచ్చు. అంటే రూ. 25, రూ. 55, రూ. 108 ప్లాన్స్ కలిగి ఉంటే.. మీరు ప్రత్యేకంగా హంగామా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందాల్సిన పని లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile Data, Mobile recharge, VODAFONE, Vodafone Idea