హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Recharge Plans: అమేజింగ్ ప్లాన్.. ఏడాదిపాటు డిస్నీ హాట్‌స్టార్ ఫ్రీగా చూడండి.. ఇంకా 48 జీబీ డేటా ఉచితం!

Recharge Plans: అమేజింగ్ ప్లాన్.. ఏడాదిపాటు డిస్నీ హాట్‌స్టార్ ఫ్రీగా చూడండి.. ఇంకా 48 జీబీ డేటా ఉచితం!

Recharge Plans: అమేజింగ్ ప్లాన్.. ఏడాదిపాటు డిస్నీ హాట్‌స్టార్ ఫ్రీగా చూడండి.. ఇంకా 48 జీబీ డేటా ఉచితం!

Recharge Plans: అమేజింగ్ ప్లాన్.. ఏడాదిపాటు డిస్నీ హాట్‌స్టార్ ఫ్రీగా చూడండి.. ఇంకా 48 జీబీ డేటా ఉచితం!

Vodafone Idea | అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. ఉచితంగానే డిస్నీ హాట్‌స్టార్ పొందొచ్చు. ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇంకా 48 జీబీ డేటా ఉచితంగా వస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Vi Plans | ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లక అందిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. పలు రకాల ప్లాన్లపై ఉచితంగానే అదనపు డేటా ప్రయోజనాలు కల్పిస్తోంది. అంతేకాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 48 జీబీ వరకు ఉచితంగా డేటా (Data) వస్తుంది. ఏడాది పాటు ఉచితంగా డిస్నీ హాట్‌స్టార్ (Disney) చూడొచ్చు. కంపెనీ ఏ ఏ ప్లాన్లపై ఇలాంటి బెనిఫిట్స్ అందుబాటులో ఉంచిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు రూ. 601 రీచార్జ్ ప్లాన్ అందిస్తోంది. అలాగే రూ. 901 రీచార్జ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంచింది. ఈ రెండు ప్లాన్లపై అదనపు డేటా బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇంకా ఉచితంగా హాట్‌స్టార్ డిస్నీ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏ ఏ ప్లాన్లపై లాంటి బెనిఫిట్స్ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

బాహుబలి పవర్ బ్యాంక్.. ఫోన్లకే కాదు ల్యాప్‌టాప్స్‌కు కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు!

రూ. 901 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్‌పై 48 జీబీ అదనపు డేటా పొందొచ్చు. ఇంకా ఏడాది పాటు ఉచితంగా డిస్నీ హాట్‌స్టార్ చూడొచ్చు. అలాగే రోజుకు 3 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు. అలాగే బింగ్ ఆల్ నైట్, వీఐ హీరో, వీఐ మూవీస్ అండ్ టీవీ వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపొచ్చు. వీకెండ్ డేలా రోలోవర్ బెనిఫిట్ ఉంది. అలాగే డేటా డిలైట్స్ బెనిఫిట్ ఉంది

నెలకు రూ.270తో స్మార్ట్‌టీవీ కొనండి.. 70 శాతానికి పైగా డిస్కౌంట్!

ఇక రూ. 601 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ కింద కూడా రోజుకు 3 జీబీ డేటా వస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. బింగ్ ఆల్ నైట్, వీఐ హీరో, వీఐ మూవీస్ అండ్ టీవీ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్లాన్ కింద కూడా ఏడాది పాటు ఉచితంగా డిస్నీ హాట్‌స్టార్ చూడొచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు 16 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపొచ్చు.

ఇలా రెండు ప్లాన్లపై దాదాపు ఒకే రకమైన బెనిఫిట్స్ ఉన్నాయి. వాలిడిటీ మాత్రం వేరుగా ఉంది. అలాగే ఉచిత డేటాలో కూడా మార్పు ఉంది. అందువల్ల హాట్ స్టార్ డిస్నీ చూడాలని భావించే వారు ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఇటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా ఉచిత డేటా పొందొచ్చు. ఒక్క ప్లాన్‌తో పలు రకాల బెనిఫిట్స్ లభిస్తాయి.

First published:

Tags: Mobile recharge, Recharge, Recharge plans, VODAFONE, Vodafone Idea

ఉత్తమ కథలు