Vodafone Idea: రోజూ 4 జీబీ డేటాతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్... వివరాలివే

Vodafone Idea Prepaid Recharge Plan | వొడాఫోన్ ఐడియా మరో మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. వాటి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 27, 2020, 12:44 PM IST
Vodafone Idea: రోజూ 4 జీబీ డేటాతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్... వివరాలివే
Vodafone Idea: రోజూ 4 జీబీ డేటాతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వొడాఫోన్ ఐడియా యూజర్లకు శుభవార్త. డబుల్ డేటా ఆఫర్లను ప్రకటించింది వొడాఫోన్ ఐడియా. రూ.299, రూ.449, రూ.699 ధరలతో ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ కేవలం తొమ్మిది టెలికామ్ సర్కిల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్స్‌లో రూ.299, రూ.449 ప్లాన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రూ.699 ప్లాన్ ప్రస్తుతానికి లేదు. ఇక ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి రోజుకు 4 జీబీ డేటా లభిస్తుంది. గతంలో ఉన్న రూ.249, రూ.399, రూ.599 డబుల్ డేటా ప్లాన్స్‌ని ఆపేసింది వొడాఫోన్ ఐడియా. వీటి స్థానంలో కొత్త ప్లాన్స్ ప్రకటించింది. మరి ఏఏ ప్లాన్స్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.

Rs 299 Plan: వొడాఫోన్ ఐడియా రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 4 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వేలిడిటీ 28 రోజులు.

Rs 449 Plan: వొడాఫోన్ ఐడియా రూ.449 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 4 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వేలిడిటీ 56 రోజులు.

Rs 699 Plan: వొడాఫోన్ ఐడియా రూ.699 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 4 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వేలిడిటీ 84 రోజులు.

ఇవి కూడా చదవండి:

BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్... మే 19 వరకు ఈ ఫ్రీ ప్లాన్ వేలిడిటీ

Police Pass: అత్యవసరమైన పనులున్నాయా? పోలీస్ పాస్ తీసుకోండి ఇలాSBI Personal Loan: జస్ట్ 4 క్లిక్స్‌తో ఎస్‌బీఐలో పర్సనల్ లోన్... స్టెప్స్ ఇవే
Published by: Santhosh Kumar S
First published: April 27, 2020, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading