Vodafone (Vi) ప్రీపెయిడ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వోడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు(Prepaid Customers) దాదాపు మూడు నెలల పాటు డిస్నీ + హాట్‌స్టార్‌కు(Disney Hotstar) ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను(Subscription) అందించే ప్లాన్ ను విడుదల చేసింది. దాని ధర రూ.151 ప్లాన్‌ను విడుదల చేసింది . Vodafone యొక్క ఈ ప్లాన్ 151 ప్రీపెయిడ్ ప్లాన్(Prepaid Plan) ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. ఇది అన్ లిమిటెడ్(Un Limited) కాదు. ఉచితంగా కాల్స్ మరియు మెసేజ్ లను కలిగి ఉండదు. అపరిమిత ఉచిత కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను కోరుకునే వినియోగదారులు అధిక విలువ కలిగిన ప్యాక్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
Vodafone (Vi) 151 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
Vi అందించే కొత్త 151 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులను 3 నెలల పాటు ఉచిత Disney Plus Hotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ని అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా డిస్నీ + హాట్‌స్టార్ షోలను ఆస్వాదించవచ్చు. Vi 151 ప్రీపెయిడ్ ప్లాన్ 2022 దాని వినియోగదారులకు 30 రోజుల చెల్లుబాటుతో దాదాపు 8 GB డేటాను అందిస్తుంది. అయితే ఇది అపరిమిత కాలింగ్ మరియు SMS సేవలను అందించదు. దీంతోపాటు వినియోగదారులు తమకు నచ్చిన కాలర్ ట్యూన్‌ను ఎంచుకోవచ్చు. వీఐ యాప్‌లోని మ్యూజిక్ సెక్షన్లో ఈ కాలర్ ట్యూన్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనికి రూ.69 సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది.
రిలయన్స్ జియో కూడా ఇటీవలే రూ.149 ప్లాన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 20 రోజులుగా ఉంది. రోజుకు 1 జీబీ డేటాతో పాటు.. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్.. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభించనుంది. అంతే కాకుండా.. 2జీ నుంచి 4జీకి మారాలనుకునే వారికి రూ.100 క్యాష్‌బ్యాక్‌ను Vi అందిస్తోంది.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
ఇతర ప్యాక్ ప్రయోజనాలిలా..
Vi 399 ప్రీపెయిడ్ ప్లాన్.. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 2 GB రోజువారీ డేటా మరియు 28 రోజుల పాటు ప్రతిరోజూ 100 SMSలు ఉంటాయి.
Vi 499 ప్రీపెయిడ్ ప్లాన్ ... వినియోగదారులకు ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలు – రోజువారీ 2 GB డేటా, 100 SMS/రోజు మరియు 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్.
Vi 601 ప్రీపెయిడ్ ప్లాన్.. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలలో రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు వస్తాయి. అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 3 GB డేటా/రోజు 28 రోజుల పాటు ఉంటాయి.
Vi 901 ప్రీపెయిడ్ ప్లాన్.. 1 సంవత్సరం ఉచిత డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, 70 రోజుల వ్యవధిలో 3 GB డేటా/రోజు ఉంటుంది.
Vi 1066 ప్రీపెయిడ్ ప్లాన్.. 84 రోజుల పాటు 2 GB డేటా/రోజుతో పాటు 1 సంవత్సరం ఉచిత Disney + Hotstar మొబైల్ సబ్స్క్రిప్షన్ ను పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disney+ Hotstar, VODAFONE, Vodafone Idea