Home /News /technology /

VIVO Y76S PRICE CNY 1799 LAUNCH SALE SPECIFICATIONS FEATURES GH VB

Vivo: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఆకట్టుకునే ఫీచర్లు.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మిడ్ రేంజ్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విభాగంలో సత్తా చాటుతున్న వివో సంస్థ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. తమ ‘వై’ సిరీస్‌లో తాజాగా వివో వై 76 ఎస్ (Vivo Y76s) డివైజ్‌ను విడుదల చేసింది. కొత్త వివో స్మార్ట్‌ఫోన్‌ను 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 44W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి టాప్ ఫీచర్లతో రూపొందించారు.

ఇంకా చదవండి ...
మిడ్ రేంజ్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విభాగంలో సత్తా చాటుతున్న వివో సంస్థ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. తమ ‘వై’ సిరీస్‌లో తాజాగా వివో వై 76 ఎస్ (Vivo Y76s) డివైజ్‌ను విడుదల చేసింది. కొత్త వివో స్మార్ట్‌ఫోన్‌ను 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 44W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి టాప్ ఫీచర్లతో రూపొందించారు. వివో Y76s డివైజ్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో దీన్ని అభివృద్ధి చేసింది. గ్రేడియంట్ బ్యాక్ ఫినిషింగ్‌తో డిజైన్ చేసిన ఈ డివైజ్‌.. మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతానికి వివో దీన్ని చైనాలోనే లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ లాంచింగ్ గురించి స్పష్టమైన సమాచారం లేదు.

Google Home Remote: ఆండ్రాయిడ్ యూజర్లకు మరో యాప్ బేస్డ్ గూగుల్ టీవీ రిమోట్‌ ఆప్షన్.. వివరాలివే..


వివో Y76s ధర ఎంత?
వివో Y76s ధర వేరియంట్‌ను బట్టి మారుతుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను CNY 1,799 (దాదాపు రూ. 20,800)గా నిర్ణయించారు. 8GB + 256GB వేరియంట్ ధర CNY 1,999 (దాదాపు రూ. 23,200)గా ఉంది. గెలాక్సీ బ్లూ, స్టార్ డైమండ్ వైట్, స్టార్రీ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభించనుంది.

వివో Y76s ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 11, OriginOS 1.0తో పనిచేస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, 90.61 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 810 SoC, 8GB వరకు LPDDR4x RAM.. వంటి స్పెసిఫికేషన్లతో వివో వై 76 ఎస్ ఫోన్‌ను రూపొందించారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇందులో అందించారు.

Gangavva: ‘గంగవ్వ’ చిరకాలపు కల నెరవేరింది.. ఆ విషయంలో భావోద్వేగానికి గురైన గంగవ్వ..


వివో Y76s స్మార్ట్‌ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ ఉంటుంది. 256GB వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ దీని సొంతం. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించవచ్చు. 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్.. వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ డివైజ్‌లో ఉన్నట్లు వివో ప్రకటించింది. 4,100mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో ఈ ఫోన్ యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, Vivo

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు