హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vivo Y75 4G: భారత్‌లో లాంచ్‌ అయిన Vivo Y75.. ధర, స్పెసిఫికేషన్లు ఇలా..!

Vivo Y75 4G: భారత్‌లో లాంచ్‌ అయిన Vivo Y75.. ధర, స్పెసిఫికేషన్లు ఇలా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Y సిరీస్‌లో మరో కొత్త మోడల్ 4జీ స్మార్ట్ ఫోన్‌ను ‘వివో‘ లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ Y75లో మీడియా టెక్ ప్రాసెసర్, ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికే వివో Y75 5జీ మోడల్ అందుబాటులోకి రాగా, తాజాగా ఇదే సిరీస్‌లో 4జీ మోడల్ లాంచ్ అయింది.

ఇంకా చదవండి ...

Y సిరీస్‌లో మరో కొత్త మోడల్ 4జీ స్మార్ట్ ఫోన్‌ను ‘వివో‘ భారత్‌లో లాంచ్ చేసింది. మిడ్- రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త మోడల్ Y75లో మీడియా టెక్ ప్రాసెసర్, ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికే వివో Y75 5జీ మోడల్ అందుబాటులోకి రాగా, తాజాగా ఇదే సిరీస్‌లో 4జీ మోడల్ లాంచ్ అయింది.

వివో Y75 4G ధర ఇలా..

ఈ ఫోన్‌ను సింగిల్ వేరియంట్‌లో తీసుకొచ్చారు. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్‌ ధర రూ.20,999గా ఉంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‌గా ర్యామ్ కెపాసిటీని మరో 4 జీబీ వరకు పొడిగించుకోవచ్చు. అలాగే స్టోరేజీ కెపాసిటీని పెంచుకునేందుకు మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. డ్యాన్సింగ్ వేవ్స్, మూన్‌లైట్ షాడో కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఫ్లిప్‌కార్ట్‌, వివో అధికారిక ఆన్‌లైన్ ఈ-స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ Vivo Y75ను కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి రూ. 1,500 డిస్కౌంట్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

వివో Y75 4G స్పెసిఫికేషన్లు

ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12తో లాంచ్ అయింది. 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లే ప్యానెల్‌తో వివో వై75 అందుబాటులోకి రానుంది. మీడియాటెక్ డైమన్సిటీ జీ96 ప్రాసెసర్‌ను ఇందులో వినియోగించారు. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలు.. వెనుక భాగంలో మూడు, ముందు భాగంలో ఒకటి అమర్చారు. 50MP మెయిన్ సెన్సార్‌తో వెనుకవైపు ట్రిపుల్-కెమెరా సెటప్‌ ఉంది. ఇతర రెండు కెమెరాల్లో ఒకదాంట్లో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, మరోదాంట్లో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి.

ముందు భాగంలో వివో Y75‌కి సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకునేందుకు 44 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. అలాగే 4050 mAh బ్యాటరీని ఇస్తున్నారు. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌చేస్తుంది. 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఇందులో ఫీచర్లుగా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే.. దేశీయ టెలికాం దిగ్గజం జియో కంపెనీ తన జియో ఫోన్ సెక్ట్స్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే ఇక్కడ ఒక కండీషన్ విధించింది. ఏదైనా 4జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుని జియో ఫోన్ నెక్ట్స్‌ను కొనుగోలు చేస్తే రూ.2 వేలు డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈమేరకు జిమో తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. కాగా, గతేడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన జియో ఫోన్ నెక్ట్స్‌ ధర ప్రస్తుతం రూ. 6,499గా ఉంది.

మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని 4జీ మోడల్‌లో ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్‌ను జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.45 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్‌తో ఈ ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 2జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్‌కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మెమోరీని 512‌జీబీ వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు.

First published:

Tags: 5G Smartphone, Smartphones, Vivo

ఉత్తమ కథలు