Home /News /technology /

VIVO Y75 5G SMARTPHONE LAUNCHED WITH MEDIATEK DIMENSITY 700 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

Vivo Y75 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో వివో వై75 రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

Vivo Y75 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో వివో వై75 రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే
(image: Vivo India)

Vivo Y75 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో వివో వై75 రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే (image: Vivo India)

Vivo Y75 5G | వివో వై75 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 (MediaTek Dimensity 700) ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కావడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్ తెలుసుకోండి.

    వివో ఇండియా చాలా దూకుడుగా కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తూనే ఉంది. వివో ఇండియా నుంచి ఈ నెలలోనే భారతదేశంలో వివో వీ23 సిరీస్ (Vivo V23 Series), వివో వై21ఏ, వివో వై33టీ లాంటి మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు వివో వై75 5జీ (Vivo Y75 5G) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. వివో వై సిరీస్‌లో వచ్చిన మరో స్మార్ట్‌ఫోన్ ఇది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. రూ.25000 లోపు సెగ్మెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను వివో రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ బడ్జెట్‌లో షావోమీ 11ఐ, రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, ఎంఐ 11 లైట్, ఐకూ జెడ్5 లాంటి మోడల్స్ ఉన్నాయి. వీటికి వివో వై75 5జీ స్మార్ట్‌ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుంది.

    వివో వై75 5జీ ధర


    వివో వై75 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగానే సేల్ కూడా మొదలైంది. కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ధర రూ.21,990. వివో ఇండియా ఇ స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనొచ్చు. రీటైల్ స్టోర్లలో కూడా వివో వై75 5జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది.

    TRAI New Rule: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్... ట్రాయ్ కొత్త రూల్

    వివో వై75 5జీ ఫీచర్స్


    వివో వై75 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ సాంసంగ్ గెలాక్సీ ఏ13, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42, రియల్‌మీ నార్జో 30, రెడ్‌మీ నోట్ 10టీ, పోకో ఎం3 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఏ22, ఒప్పో ఏ53ఎస్, రియల్‌మీ 8 లాంటి మోడల్స్‌లో ఉంది.

    వివో వై75 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ ర్యామ్ ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో మరో 4జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే మొత్తం 12జీబీ ర్యామ్ వాడుకోవచ్చు. ఇందులో 128జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

    Vivo Y33T: రూ.18,990 విలువైన స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,850 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్

    వివో వై75 5జీ కెమెరా


    వివో వై75 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ బొకే కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. ఇందులో వివో ఎక్స్‌స్ట్రీమ్ నైట్ ఏఐ బేస్డ్ ఆల్గరిథమ్ ఫీచర్ ఉండటం విశేషం. ఒకేసారి ఫ్రంట్ కెమెరా, రియర్ కెమెరాతో రికార్డింగ్ చేయొచ్చు.

    వివో వై75 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్‌లైట్ బ్లాక్, గ్లోయింగ్ గెలాక్సీ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone, Vivo

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు