Home /News /technology /

Vivo Y74s: వివో నుంచి మరో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్ లాంచ్​.. అందుబాటు ధరలోనే అదిరిపోయే ఫీచర్లు

Vivo Y74s: వివో నుంచి మరో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్ లాంచ్​.. అందుబాటు ధరలోనే అదిరిపోయే ఫీచర్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ వివో నుంచి మరో మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్ లాంచ్​ అయ్యింది. వివో Y74s (Vivo Y74s) పేరుతో ఇది చైనా మార్కెట్​లోకి (China Market) విడుదలైంది.

ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ వివో(Vivo) నుంచి మరో మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్(Smartphone) లాంఛ్​ అయ్యింది. వివో Y74s (Vivo Y74s) పేరుతో ఇది చైనా(China) మార్కెట్​లోకి విడుదలైంది. ఈ సరికొత్త స్మార్ట్​ఫోన్​లోని ఫీచర్లు.. ఈ నెల ప్రారంభంలో చైనీస్ మార్కెట్‌లోకి వచ్చిన వివో Y76ఎస్ ఫోన్‌కు (Vivo Y76s) సమానంగా ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. దీనిలో వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే నాచ్‌ని అందించింది. వివో Y74s మీడియా టెక్​ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ మొత్తం రెండు విభిన్న కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం వివో చైనా వెబ్‌సైట్‌లో గెలాక్సీ బ్లూ, స్టార్రీ నైట్ బ్లాక్ కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

వివో వై74 ఎస్​ ధర, లభ్యత
వివో వై74 ఎస్​ సింగిల్ వేరియంట్​లోనే లభిస్తుంది. 8 జీబీ ర్యామ్​ + 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ గల వేరియంట్​ CNY 2,299 (దాదాపు రూ. 26,800) వద్ద లభిస్తుంది. ప్రస్తుతం చైనాలో లాంచ్​ అయిన ఈ స్మార్ట్​ఫోన్​.. భారత్​లో లాంచింగ్​ తేదీపై ఎటువంటి స్పష్టత లేదు. అయితే త్వరలోనే ఈ డివైజ్‌ విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఈ నెల ప్రారంభంలో లాంచ్​ అయిన వివో వై 76ఎస్​తో సమానంగా ఉండనుంది. ప్రస్తుతం చైనాలో 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్ గల వివో Y76s వేరియంట్ CNY 1,799 (దాదాపు రూ. 21,000) వద్ద లభిస్తుంది. 8 జీబీ ర్యామ్​+ 256 జీబీ స్టోరేజ్ మోడల్‌ CNY 1,999 (దాదాపు రూ. 23,300) వద్ద లభిస్తుంది.
Laptop Tips: ల్యాప్‌టాప్ ఎక్కువ‌గా వాడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే!

వివో వై 74 ఎస్ స్పెసిఫికేషన్లు
వివో వై76 ఎస్​ మాదిరిగానే, వివో వై 74 డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్​తో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్​ ఓస్​ 1.0తో రన్ అవుతుంది. వివో వై 74 స్మార్ట్​ఫోన్​ 6.58 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో వస్తుంది. వివో వై74 ఎస్​ ఆక్టా-కోర్ మీడియా టెక్​ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం దీని ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను అందించింది.
Truecaller: ఫోన్ కాల్స్ రికార్డ్ చేయాలా? ట్రూకాలర్ యాప్‌లో చేయొచ్చు ఇలా

వివో వై74 ఎస్​ స్మార్ట్​ఫోన్​ 256 జీబీ స్టోరేజ్​ను కలిగి ఉంటుంది. మైక్రో ఎస్​డీ కార్డ్​ సహాయంతో స్టోరేజ్​ను 1 టీబీ వరకు పొడిగించుకోవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్​టీఈ, వైఫై, బ్లూటూత్ v5.1, జీపీఎస్​/ఏజీపీఎస్​, యూఎస్​బీ టైప్- సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్​తో వస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్​ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్​ను చేర్చింది. వివో వై 74 ఎస్​ 4,100mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 44W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, Vivo

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు