Vivo Y72 5G: వివో నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్... రూ.1,500 క్యాష్‌బ్యాక్

Vivo Y72 5G: వివో నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్... రూ.1,500 క్యాష్‌బ్యాక్ (image: Vivo India)

Vivo Y72 5G | రూ.20,000 బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది.

  • Share this:
    స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ ఇండియన్ మార్కెట్లోకి వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా వివో కొత్త 5జీ మొబైల్‍ను పరిచయం చేసింది. వివో వై72 5జీ మోడల్‌ను రిలీజ్ చేసింది. వివో వై72 స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది మార్చిలో థాయ్‌ల్యాండ్‌లో రిలీజ్ అయింది. దీంతో స్పెసిఫికేషన్స్ అందరికీ తెలిసినవే. ఇండియాలో వివో వై72 5జీ వేరియంట్ రిలీజ్ కావడం విశేషం. వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగానే సేల్ మొదలైంది. వివో వై72 5జీ కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.20,990. అమెజాన్, ప్లిప్‌కార్ట్, పేటీఎం, టాటా క్లిక్, బజాజ్ ఈఎంఐ స్టోర్, వివో ఇండియా ఇ-స్టోర్‌తో పాటు ఇతర స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.

    Exchange Offer: రూ.17,000 ధరకే ఐఫోన్... ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్

    WhatsApp: ఒకే వాట్సప్ అకౌంట్ 4 డివైజ్‌లలో వాడుకోవచ్చు... కొత్త ఫీచర్ వచ్చేసింది


    వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలతో కొంటే రూ.1,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆరు నెలల వరకు రూ.999 విలువైన వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఉచితం. జియో నుంచి రూ.10,000 విలువైన బెనిఫిట్స్ పొందొచ్చని కంపెనీ చెబుతోంది. 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

    Nothing Ear 1 TWS: ఈ ఇయర్‌బడ్స్ కావాలా? వేలంపాటలో కొనుక్కోవాలి

    Nokia G20: నోకియా జీ20 సేల్ మొదలైంది... డిస్కౌంట్ వివరాలు ఇవే

    వివో వై72 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ సెకండరి సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

    వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అల్‌ట్రా గేమ్ మోడ్, ఇస్పోర్ట్స్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సిస్టమ్ ప్రాసెస్ ఆప్టిమైజ్ చేసేందుకు మల్టీ-టర్బో 5.0 ఫీచర్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ నెట్వర్క్ ఆప్షన్స్ ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published: