Vivo Y53s: ఇండియాలో లాంఛ్ అయిన వివో వై53ఎస్... ధర ఎంతంటే

Vivo Y53s: ఇండియాలో లాంఛ్ అయిన వివో వై53ఎస్... ధర ఎంతంటే (image: Vivo India)

Vivo Y53s | ఇండియాలో రూ.20,000 లోపు సెగ్మెంట్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. వివో వై53ఎస్ ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ అయిన వివో ఇండియాలో మరో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసింది. వై సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. వివో వై53ఎస్ మోడల్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, ఎక్స్‌టెండెడ్ ర్యామ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వివో వై53ఎస్ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.19,490. వివో ఇండియా ఇ-స్టోర్. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ ఈఎంఐ స్టోర్, రీటైల్ స్టోర్స్‌లో కొనొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జియో నుంచి రూ.7,000 బెనిఫిట్స్ ఉంటాయని కంపెనీ చెబుతోంది.

    Smartphone Tips: పాత మొబైల్ అమ్ముతున్నారా? డేటా ఇలా డిలిట్ చేయండి

    Mony Mint: ఏటీఎం కార్డు సైజ్‌లో స్మార్ట్‌ఫోన్... ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్


    వివో వై53ఎస్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ ఉంది. 3జీబీ వరకు అదనంగా ర్యామ్ పెంచుకునే అవకాశం ఉంది. ఇక 128జీబీ స్టోరేజ్ ఉండగా ఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరాల విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో సూపర్ నైట్ కెమెరా మోడ్, ఐ ఆటో ఫోకస్, అల్‌ట్రా స్టేబుల్ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    WhatsApp: టైప్ చేయకుండా వాట్సప్ మెసేజెస్ పంపండి ఇలా

    Yono SBI App: ఎస్‌బీఐ యోనో లైట్ యాప్‌లో లభించే బ్యాంకింగ్ సేవలు ఇవే

    వివో వై53ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సిస్టమ్ ఆప్టిమైజేషన్ కోసం మల్టీ టర్బో 5.0, అల్‌ట్రా గేమ్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను డీప్ సీ బ్లూ, పెంటాస్టిక్ రెయిన్‌బో కలర్స్‌లో కొనొచ్చు. రూ.20,000 లోపు బడ్జెట్‌లో రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్, రెడ్‌మీ నోట్ 10 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎం51, రియల్‌మీ ఎక్స్7 లాంటి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. రూ.20,000 లోపు సెగ్మెంట్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్లకు వివో వై53ఎస్ గట్టి పోటీ ఇవ్వనుంది.
    Published by:Santhosh Kumar S
    First published: