• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • VIVO Y51 SMARTPHONE LAUNCHED IN INDIA WITH QUALCOMM SNAPDRAGON 665 AND 5000MAH BATTERY KNOW PRICE AND SPECS SS

Vivo Y51: భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాతో వివో వై51 రిలీజ్

Vivo Y51: భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాతో వివో వై51 రిలీజ్

Vivo Y51: భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాతో వివో వై51 రిలీజ్

Vivo Y51 Released | ఇండియన్ మార్కెట్లోకి వివో నుంచి వివో వై51 స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

  • Share this:
    కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభార్త. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఇటీవల ఇండోనేషియా మార్కెట్‌లో రిలీజ్ చేసిన వివో వై51 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు తీసుకొచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా ఉండటం విశేషం. పోర్ట్‌రైట్, 4కే వీడియో రికార్డింగ్, అల్ట్రా స్టేబుల్ వీడియో, ప్యానోరమా, లైవ్ ఫోటో, స్లో-మో, టైమ్ ల్యాప్స్, సూపర్ నైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వివో వీ20 స్మార్ట్‌ఫోన్ లాగానే వివో వై51 స్మార్ట్‌ఫోన్‌లో రియల్ కెమెరా ఉండటం విశేషం. వివో వై51 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,990. ఇది మేక్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ అని చెబుతోంది వివో. గ్రేటర్ నోయిడాలోని వివో కంపెనీలో ఈ ఫోన్ తయారవుతోందని వెల్లడించింది. ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న స్పష్టత లేదు. అయితే బజాజ్ ఫిన్‌సర్వ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై ఆఫర్స్ ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. ఇక వివో వై30 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ మోడల్ రిలీజ్ చేస్తున్నట్టు వివో ప్రకటించింది. వివో వై30 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,990.

    Moto G 5G: రూ.6,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో సేల్

    IRCTC PNR Status: మీ రైలు టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో సింపుల్‌గా తెలుసుకోండి ఇలా

    వివో వై51 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.58 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+
    ర్యామ్: 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: టైటానియం సాఫైర్, క్రిస్టల్ సింఫనీ
    ధర: రూ.17,990

    రోజూ 3జీబీ డేటా కావాలా? ఈ Jio, Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి

    WhatsApp New Features: వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

    ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఇప్పటికే రియల్‌మీ 7 ప్రో, పోకో ఎక్స్3, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం31 ఎస్, సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ ఎడిషన్ లాంటి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ మోడల్స్‌కు వివో వై51 గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు