వివో ఇండియా భారతదేశంలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. లేటెస్ట్గా వివో వై35 (Vivo Y35) రిలీజ్ చేసింది. ఇందులో 8GB ర్యామ్ + 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్‌తో మొత్తం కలిపి 16GB ర్యామ్, 128GB స్టోరేజ్, 50MP కెమెరా, 44W ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.20,000 లోపు బడ్జెట్లో (Smartphone Under Rs 20,000) రిలీజైంది. ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. వివో వై35 కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజైంది. ధర రూ.18,499. వివో ఇండియా ఇ-స్టోర్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. అగేట్ బ్లాక్, డాన్ గోల్డ్ కలర్స్‌లో లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, వన్ కార్డ్‌తో కొంటే రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకే.
వివో వై35 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల పుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ మోటో జీ32, మోటో జీ52, రెడ్మీ 10 పవర్, రియల్మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్మీ 10, రెడ్మీ నోట్ 11, వివో వై33టీ, రియల్మీ 9ఐ స్మార్ట్ఫోన్లలో ఉంది.
Mesmerize the world with your style. Get the stunning new #vivoY35 today!
Buy Now: https://t.co/Y5brVfD8xf#ItsMyStyle #vivo #NewLaunch pic.twitter.com/hnhGceuQs3
— Vivo India (@Vivo_India) August 29, 2022
వివో వై35 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఎక్స్టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్‌తో 8జీబీ వరకు అదనంగా ర్యామ్ పెంచుకోవచ్చు. మొత్తం 16జీబీ వరకు ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. ఇక మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
వివో వై35 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ బొకే కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో మల్టీ టర్బో మోడ్, అల్ట్రా గేమ్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రియర్ కెమెరాలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS), స్టెబిలైజేషన్ అల్గారిథమ్స్, సూపర్ నైట్ కెమెరా మోడ్, మల్టీ స్టైల్ పోర్ట్రైట్ మోడ్, రియర్ కెమెరా బోకే ఫ్లేర్ పోర్ట్రైట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Samsung Galaxy A04: రూ.10,000 బడ్జెట్లో సాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్
వివో వై35 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ వేక్ ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Mobiles, Smartphone, Vivo