వివో ఇండియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. వివో వై33టీ (Vivo Y33T) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. వారం క్రితం వివో వై21టీ (Vivo Y21T) మోడల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొన్ని అదనపు ఫీచర్స్‌తో వివో వై33టీ మోడల్‌ను పరిచయం చేసింది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. వివో వై21టీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉండటం విశేషం. దీంతో పాటు రియల్మీ 9ఐ కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటుందని అంచనా. ఒప్పో ఏ36 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఇప్పుడు ఈ లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తోనే వివో వై33టీ రిలీజ్ కావడం విశేషం.
వివో వై33టీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.18,990. కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. సేల్ కూడా ప్రారంభమైంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, పేటీఎం, టాటా క్లిక్, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ స్టోర్, ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ప్రస్తుతం రూ.20,000 లోపు బడ్జెట్లో రెడ్మీ నోట్ 11టీ, మోటో జీ60, రియల్మీ నార్జో 30 5జీ, రియల్మీ 8ఎస్, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లకు వివో వై33టీ గట్టి పోటీ ఇవ్వనుంది.
Vivo Y72: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది... రూ.20,000 లోపే కొనొచ్చు
వివో వై33టీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ సెల్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌తో రిలీజ్ అయింది. ర్యామ్ ఎక్స్టెన్షన్ ఫీచర్‌తో 4జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇక మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు.
Moto G71 5G: సరికొత్త ప్రాసెసర్‌తో మోటో జీ71 వచ్చేసింది... ధర ఎంతంటే
వివో వై33టీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో, డాక్యుమెంట్స్, 50 మెగాపిక్సెల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
వివో వై33టీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ టైప్ సీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మిడ్డే క్రీమ్, మిర్రర్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Mobiles, Smartphone, Vivo