HOME »NEWS »TECHNOLOGY »vivo y31 launched in india with qualcomm snapdragon 662 processor and 5000mah know price and specifications ss

Vivo Y31: వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Vivo Y31: వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే
Vivo Y31: వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Vivo Y31 | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రూ.20,000 బడ్జెట్‌లో వివో వై31 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఈ ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

  • Share this:
    చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో మరో మోడల్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. వివో వై31 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇటీవల వివో దూకుడుగా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వివోతో పాటు ఇతర కంపెనీలు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు వివో వై31 ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. ఇక ఇప్పటికే వివో నుంచి వై సిరీస్‌లో వివో వై20ఏ, వివో వై51ఏ, వివో వై12ఎస్, వివో వై20జీ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. వై సిరీస్‌లో వివో నుంచి వచ్చిన మరో మోడల్ ఇది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. గతేడాది మేలో వివో వై30 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో రిలీజైన సంగతి తెలిసిందే. ఈసారి వివో వై31 మోడల్‌ను క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో రిలీజ్ చేయడం విశేషం. ఇక ఫ్రంట్‌లో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్‌టీఈ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

    Flipkart: స్మార్ట్‌ఫోన్ ఏడాది వాడిన తర్వాత 100 శాతం మనీబ్యాక్... ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైన ఆఫర్



    Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 25 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

    వివో వై31 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌తో రిలీజైంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.16,490. వివో వై31 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, వివో ఇండియా ఇ-స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్‌ రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులపై రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థల నుంచి జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక వివో వై31ఎస్ చైనాలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 5జీ సపోర్ట్‌తో రిలీజైన సంగతి తెలిసిందే.

    Amazon Great Republic Day Sale: అమెజాన్ సేల్‌లో ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

    Micromax In Note 1: ఈ మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్

    వివో వై31 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే
    ర్యామ్: 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ బొకే సెన్సార్ + 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఫన్ టచ్ ఓఎస్ 11
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: ఓషియన్ బ్లూ, రేసింగ్ బ్లాక్
    ధర: రూ.16,490
    Published by:Santhosh Kumar S
    First published:January 21, 2021, 18:03 IST