Home /News /technology /

VIVO Y21T SMARTPHONE LAUNCHED WITH QUALCOMM SNAPDRAGON 680 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

Vivo Y21T: భారీ కెమెరా, కొత్త ప్రాసెసర్‌తో వివో వై21టీ రిలీజ్... ధర ఎంతంటే

Vivo Y21T: భారీ కెమెరా, కొత్త ప్రాసెసర్‌తో వివో వై21టీ రిలీజ్... ధర ఎంతంటే
(image: Vivo India)

Vivo Y21T: భారీ కెమెరా, కొత్త ప్రాసెసర్‌తో వివో వై21టీ రిలీజ్... ధర ఎంతంటే (image: Vivo India)

Vivo Y21T | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపా? ఈ బడ్జెట్‌లో వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    ఇండియన్ మార్కెట్లోకి కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్‌ఫోన్లు (Upcoming Smartphones) వచ్చేస్తున్నాయి. వివో ఇండియా నుంచి వివో వై21టీ (Vivo Y21T) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రూ.20,000 లోపు సెగ్మెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 4జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.16,490. ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో రూ.20,000 లోపు పాపులర్ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 10 ప్రో, రియల్‌మీ 8ఎస్, ఇటీవల రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 11టీ లాంటి మొబైల్స్ ఉన్నాయి. వీటికి వివో వై21టీ గట్టి పోటీ ఇవ్వనుంది.

    వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ విడుదల కాగానే సేల్ ప్రారంభమైంది. ఆఫ్‌లైన్ మార్కెట్‌లో అంటే రీటైల్ స్టోర్లలో లభిస్తుంది. వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్‌లో రిలీజ్ అయింది. వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో ర్యామ్‌ను 1జీబీ పెంచుకోవచ్చు. ఇక మైక్రో ఎస్‌డీ కార్డుతో స్టోరేజ్ 1టీబీ పెంచుకోవచ్చు.

    Free Subscription: ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ ఫ్రీ

    వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వివో వై21టీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. మిడ్‌నైట్ బ్లూ, పెరల్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు.

    WhatsApp: మీ అకౌంట్ బ్యాలెన్స్ వాట్సప్‌లో తెలుసుకోండి ఇలా

    వివో వై21టీ కెమెరా ఫీచర్స్


    వివో వై21టీ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ + 2 మెగాపిక్సెల్ బొకే సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో నైట్ మోడ్, పోర్ట్‌రైట్, ఫోటో, వీడియో, పనోరమా, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో, డాక్యుమెంట్స్, 50 మెగాపిక్సెల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    ఇండియన్ మార్కెట్లోకి ఇతర కంపెనీలు కూడా కొత్త మొబైల్స్ రిలీజ్ చేయబోతున్నాయి. షావోమీ ఎంఐ 11ఐ జనవరి 6న రిలీజ్ కానుంది. వివో వీ23 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 5న రిలీజ్ కానున్నాయి. త్వరలో రియల్‌మీ 9 సిరీస్ మొబైల్స్ రాబోతున్నాయి. మోటోరోలా ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ మొబైల్ ఇండియాకు రానుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile News, Mobiles, Smartphone, Vivo

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు