Home /News /technology /

VIVO Y21E SMARTPHONE LAUNCHED IN INDIA WITH SNAPDRAGON 680 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

Vivo Y21e: సరికొత్త ప్రాసెసర్‌తో వివో వై21ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే

Vivo Y21e: సరికొత్త ప్రాసెసర్‌తో వివో వై21ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే
(image: Vivo India)

Vivo Y21e: సరికొత్త ప్రాసెసర్‌తో వివో వై21ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే (image: Vivo India)

Vivo Y21e | రూ.15,000 లోపు బడ్జెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది వివో ఇండియా. వై సిరీస్‌లో వివో వై21ఈ (Vivo Y21e) మోడల్‌ను పరిచయం చేసింది. సేల్ కూడా మొదలైంది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    కొత్త సంవత్సరంలో వివో ఇండియా దూకుడుగా స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ చేస్తోంది. వివో వీ23 5జీ, వివో వీ23 ప్రో 5జీ, వివో వై33టీ, వివో వై21టీ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసిన వివో ఇండియా... లేటెస్ట్‌గా వివో వై సిరీస్‌లో వివో వై21ఈ (Vivo Y21e) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 (Snapdragon 680) ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. వివో వై21ఈ కేవలం 3జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.12,990. సేల్ ప్రారంభమైంది. వివో ఆన్‌లైన్ స్టోర్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో కూడా కొనొచ్చు. డైమండ్ గ్లో, మిడ్‌నైట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.

    వివో వై21ఈ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ హాలో ఫుల్‌వ్యూ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లేలో ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వివో వై33టీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉండటం విశేషం. త్వరలో ఇండియాలో రిలీజ్ కానున్న రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌లో కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉండబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రిలీజ్ అయింది. ఎక్స్‌టెండెడ్ ఫీచర్‌తో స్టోరేజ్ నుంచి 0.5జీబీ ర్యామ్‌గా వాడుకోవచ్చు.

    OnePlus 9RT: వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే

    వివో వై21ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో పోర్ట్‌రైట్, వీడియో, పనో, లైవ్ ఫోటో, టైమ్ ల్యాప్స్, ప్రో, డాక్యుమెంట్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో పర్సనలైజ్డ్ పోర్ట్‌రైట్ మోడ్, సూపర్ హెచ్‌డీఆర్, ఫేస్ బ్యూటీ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    Infinix: రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన ఇన్ఫీనిక్స్... లేటెస్ట్ రేట్స్ ఇవే

    వివో వై21ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్ బ్యాంకుగా పనిచేస్తుంది. స్మార్ట్‌వాచ్, ఇయర్‌ఫోన్స్‌కు రివర్స్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. వివో వై21ఈ స్మార్ట్‌ఫోన్‌లో కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 4జీ ఎల్‌టీఈ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.

    వివో వై21ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15,000 లోపు బడ్జెట్‌లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ బడ్జెట్‌లో రియల్‌మీ 8ఐ, రియల్‌మీ నార్జో 50ఏ, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ నోట్ 10ఎస్ లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్‌కు వివో వై21ఈ స్మార్ట్‌ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile News, Mobiles, Smartphone, Vivo

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు