Home /News /technology /

Vivo Y20T: బడ్జెట్ ధరలో వివో వై20టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Vivo Y20T: బడ్జెట్ ధరలో వివో వై20టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Vivo Y20T: బడ్జెట్ ధరలో వివో వై20టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే
(image: Vivo India)

Vivo Y20T: బడ్జెట్ ధరలో వివో వై20టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Vivo India)

Vivo Y20T | రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వివో నుంచి వివో వై20టీ (Vivo Y20T) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రూ.15,000 బడ్జెట్‌లో లేటెస్ట్ మొబైల్‌ను పరిచయం చేసింది వివో. ఇండియన్ మార్కెట్‌లో వివో వై20టీ (Vivo Y20T) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. వై సిరీస్‌లో వివో లాంఛ్ చేసిన మొబైల్ ఇది. ధర రూ.15,490. కేవలం 6జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్‌లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ బడ్జెట్‌లో ఇప్పటికే ఇండియాలో రియల్‌మీ నార్జో 30, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22, రియల్‌మీ నార్జో 30 5జీ, మోటో జీ40 ఫ్యూజన్, ఒప్పో ఏ54, పోకో ఎం3 ప్రో 5జీ లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లకు వివో వై20టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

    వివో వై20టీ ఆఫర్స్


    వివో వై20టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగానే సేల్ మొదలైంది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్‌, పేటీఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ స్టోర్‌లో కొనొచ్చు. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,490. బజాజ్ ఫిన్‌సర్వ్ ఫైనాన్స్ ద్వారా 12 నెలల నో- కాస్ట్ ఈఎంఐతో కొనొచ్చు. వివో ఇ-స్టోర్‌లో కొంటే రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం, టాటా క్లిక్‌లో ఆరు నెలల నో కాస్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు.

    WhatsApp Features: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... త్వరలో రాబోతున్న 5 ఫీచర్స్ ఇవే

    వివో వై20టీ ఫీచర్స్


    వివో వై20టీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్ సైడ్‌కు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌తో రిలీజ్ అయింది. ఎక్స్‌టెండెడ్ 2.0 ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ ద్వారా 1జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే 7జీబీ ర్యామ్ ఉపయోగించుకోవచ్చు.

    వివో వై20టీ కెమెరా ఫీచర్స్


    వివో వై20టీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా + సూపర్ మ్యాక్రో కెమెరా సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో ఆరా స్క్రీన్ లైట్, పోర్ట్‌రైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    Gmail Feature: జీమెయిల్‌లో సెర్చ్ ఫిల్టర్ ఫీచర్... ఎలా వాడుకోవాలంటే

    వివో వై20టీ బ్యాటరీ


    వివో వై20టీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏఐ పవర్ సేవింగ్ టెక్నాలజీ ఉందని వివో చెబుతోంది. ఫుల్ ఛార్జింగ్‌తో 20 గంటలు సినిమాలు చూడొచ్చని, 8 గంటలు గేమ్స్ ఆడొచ్చని వివో ప్రకటించింది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. మల్టీ టర్బో 5.0 ఫీచర్ ఉంది. దీంతో పాటు గేమ్ మోడ్, ఇస్పోర్ట్స్ మోడ్, 4డీ గేమ్ వైబ్రేషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile News, Mobiles, Smartphone, Vivo

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు