వివో నుంచి వై సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి. వివో వై20, వివో వై20ఐ స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది కంపెనీ. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. వివో వై20ఐ ధర రూ.11,490 కాగా, వివో వై20 ధర రూ.12,990. వివో వై20 స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్ట్ 28 నుంచి, వివో వై20ఐ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 3 నుంచి కొనొచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు వివో ఇండియా ఇ-స్టోర్, రీటైల్ స్టోర్లలో ఈ ఫోన్లు కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.