Vivo Y1s: వివో వై1ఎస్​ 3జీబీ ర్యామ్​ వేరియంట్​ వచ్చేసింది... ధర ఎంతంటే

Vivo Y1s: వివో వై1ఎస్​ 3జీబీ ర్యామ్​ వేరియంట్​ వచ్చేసింది... ధర ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Vivo Y1s | వివో వై1ఎస్ మోడల్ 3జీబీ వేరియంట్ రిలీజ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ వివో భారత మార్కెట్​లోకి మరో కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. వివో వై 1 ఎస్ సిరీస్​లో 3జీబీ ర్యామ్​ వేరియంట్​ను లాంచ్​ చేసింది. కాగా, వివో వై1 ఎస్​ సిరీస్​లో ఇదివరకే 2జీబీ​ ర్యామ్​ వేరియంట్​ అందుబాటులో ఉంది. ప్రస్తుతం విడుదలైన కొత్త మోడల్ రెండు విభిన్న కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిలో 32GB స్టోరేజ్​ స్పేస్​ను​ అందించింది. మెమరీ కార్డు సహాయంతో దీని స్టోరేజ్​ సామర్థ్యాన్ని 256 జిబి వరకు పెంచుకోవచ్చు. ఇక ధర విషయానికి వస్తే.. ఇది రూ. 9,490 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ను వివో ఇండియా ఈ–స్టోర్, అమెజాన్, ఫ్లిప్​కార్ట్​, పేటీఎమ్​, టాటా క్లిక్​, బజాజ్​ ఈఎంఐ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.​​ దేశంలోని కొన్ని ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది.

OnePlus Nord CE 5G: రూ.22,999 ధరకే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో సేల్

iQoo Z3 5G: రూ.19,990 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,490 ధరకే కొనండి ఇలా

వివో వై1ఎస్ స్పెసిఫికేషన్లు


వివో వై 1 ఎస్ మోడల్​ డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్​తో వస్తుంది. ఈ మోడల్ ఆండ్రాయిడ్ 10 ఫన్‌టచ్ ఓఎస్ 10.5తో పని చేస్తుంది. దీనిలో 6.22 -అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను అందించింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 35 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. మెరుగైన ఫోటోలు, వీడియోల కోసం, ఈ స్మార్ట్​ఫోన్​ వెనుకవైపు 13 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను అందించింది. ఇక, కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 4 జి ఎల్‌టిఈ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎఫ్‌ఎం రేడియో, మైక్రో-యుఎస్‌బి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి అద్భుతమైన ఆప్షన్లు అందించింది. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లను చేర్చింది. ఈ స్మార్ట్​ఫోన్​లో 4,030 ఎంఏహెచ్ బ్యాటరీ అందించింది. ఇది ఫాస్ట్​ చార్జింగ్​ సపోర్ట్​తో వస్తుంది.

Jio 4G Data Plans: మొబైల్ డేటా ఎక్కువ కావాలా? జియో అందిస్తున్న12 డేటా ప్లాన్స్ ఇవే

iQoo Z3 5G: రూ.19,990 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,490 ధరకే కొనండి ఇలా

పెరిగిన వివో వై 1, వివో వై 12 ధరలు


కాగా, వివో వై1 2జీబీ ర్యామ్ మోడల్​తో పాటు, వివో వై 12 ధరలను పెంచేసింది వీవో సంస్థ. భారత మార్కెట్​లో వీటి ధరను రూ. 500 మేర పెంచేసింది. వివో వై 1 ఎస్ 2 జిబి వేరియంట్ ధర గతంలో రూ. 7,990 ఉండగా.. దీన్ని రూ. 8,490కు పెంచింది. ఇక, వివో వై 12 ఎస్ ధర గతంలో రూ. 9,990 ఉండగా.. దీని ధరను రూ. 10,490కు పెంచింది. వివో వై 1​లోని 2 జీబీ ర్యామ్ మోడల్​ గతేడాది నవంబర్‌లో లాంచ్ అవ్వగా.. వివో వై 12 మోడల్​ 2021 జనవరిలో ప్రారంభమైంది.
Published by:Santhosh Kumar S
First published: