హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vivo Y16: రూ.10వేల రేంజ్‌లో బెస్ట్ ఫీచర్లతో వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ లాంచ్‌.. దీని ప్రత్యేకతలు ఇవే..

Vivo Y16: రూ.10వేల రేంజ్‌లో బెస్ట్ ఫీచర్లతో వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ లాంచ్‌.. దీని ప్రత్యేకతలు ఇవే..

Vivo Y16 (PC: Vivo)

Vivo Y16 (PC: Vivo)

Vivo Y16: వివో Y సిరీస్‌ నుంచి ఇండియాలో మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వివో Y16 (Vivo Y16) పేరుతో వచ్చిన ఈ లేటెస్ట్ డివైజ్‌లో కంపెనీ తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్లను పరిచయం చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ (Vivo) ఇండియాలో బడ్జెట్ ఫోన్ల (Budget Phones)ను క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తోంది. మొదటిసారి స్మార్ట్‌ఫోన్ (Smartphone) వాడేవారే టార్గెట్‌గా కంపెనీ Y సిరీస్‌ నుంచి కొత్త మోడళ్లను పరిచయం చేస్తోంది. ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి ఇండియాలో మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వివో Y16 (Vivo Y16) పేరుతో వచ్చిన ఈ లేటెస్ట్ డివైజ్‌లో కంపెనీ తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్లను పరిచయం చేసింది. 5000 mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో 6.51 అంగుళాల స్క్రీన్, డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో ఇది కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండియాలో దీని ధరతో పాటు స్మార్ట్‌ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్స్ చూద్దాం.

* ధర ఎంత?

ఇండియాలో వివో Y16 ప్రారంభ ధర రూ9,999గా ఉంది. 3GB RAM, 32 GB స్టోరేజ్ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. 4 GB RAM, 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499 వరకు ఉంది. దీనిపై కొన్ని లాంచింగ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HDFC డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో వివో Y16 ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

అన్ని పార్ట్నర్ రిటైల్ స్టోర్లలో కోటక్, IDFC, OneCard, BOB, ఫెడరల్, AU బ్యాంక్ కార్డ్‌లతో ఫోన్‌ను కొనుగోలు చేసేవారు రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వివో Y16 ఫోన్‌ ఇండియాలోని అన్ని ఆన్‌లైన్ స్టోర్లతో పాటు పార్ట్నర్ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.

* డిజైన్, కెమెరా

వివో Y16లో కంపెనీ తక్కవ ధరలోనే బెస్ట్ కెమెరా లెన్స్ అందించింది. దీంట్లో 13MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP మాక్రో కెమెరాతో కూడిన AI-పవర్డ్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. 5MP సెల్ఫీ కెమెరా తో కలిపి ఫోన్‌లో మొత్తం మూడు లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌ 6.51 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది.

ఇది కూడా చదవండి : డిజీలాకర్‌లో మీ నామినీ పేరు యాడ్ చేయండి ఇలా

ఫ్లాట్ ఫ్రేమ్‌తో పాటు రౌండెడ్ కార్నర్స్‌తో 2.5D కర్వ్ డిజైన్‌ స్క్రీన్, ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందించింది. వివో Y16 ఫోన్ స్టెల్లార్ బ్లాక్, డ్రిజ్లింగ్ గోల్డ్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇండియన్ మార్కెట్‌లో ఇది మోటో G52, రెడ్‌మీ నోట్ 10S, శామ్‌సంగ్ గెలాక్సీ F22 వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

* స్పెసిఫికేషన్లు

వివో Y16 మీడియాటెక్ P35 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4GB RAMను అందించారు. ఎక్స్‌టెన్షన్ సపోర్ట్‌తో ర్యామ్‌ను మరో 1GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్‌లో 1TB వరకు మెమరీని ఎక్స్‌పాండ్ చేసుకునే ఆప్షన్‌తో ట్రిపుల్ కార్డ్ స్లాట్‌ను అందించారు. వివో Y16 ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఫన్‌టచ్ OS 12తో రన్ అవుతుంది. ఈ బడ్జెట్ ఫోన్‌ గేమింగ్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. గేమర్స్ కోసం మల్టీ టర్బో, అల్ట్రా గేమ్ మోడ్‌ ఈ ఫోన్‌లో ఉన్నాయి. 5000mAh బ్యాటరీతో పాటు ఫేస్ వేక్ అన్‌లాక్, సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ వంటి బెస్డ్ ఫీచర్లతో ఫోన్ లాంచ్ అయింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Smartphones, Tech news, Vivo

ఉత్తమ కథలు