VIVO Y12S LAUNCHED WITH SNAPDRAGON 439 PROCESSOR AND 5000MAH BATTERY PRICED AT RS 9990 KNOW FEATURES AND SPECIFICATIONS SS
Vivo Y12s: వివో వై12ఎస్ రిలీజ్ అయింది... ధర రూ.10,000 లోపే
Vivo Y12s: వివో వై12ఎస్ రిలీజ్ అయింది... ధర రూ.10,000 లోపే
(image: Vivo India)
Vivo Y12s | మీరు రూ.10,000 లోపు బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. వివో వై12ఎస్ ప్రత్యేకతలు తెలుసుకోండి.
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి చైనాకు చెందిన వివో మరో మోడల్‌ను రిలీజ్ చేసింది. వివో వై12ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. 2019లోనే వివై వై12 లాంఛ్ అయింది. ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వర్షన్‌ను ఇప్పుడు రిలీజ్ చేసింది. వివో వై12ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ సేవింగ్ టెక్నాలజీ ఉంది. కేవలం 3జీబీ+32జీబీ వేరియంట్లో మాత్రమే ఈ ఫోన్ రిలీజైంది. ధర రూ.9,990. ఇప్పటికే రూ.10,000 లోపు బడ్జెట్లో చాలా స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. లేటెస్ట్గా రిలీజ్ అయిన సాంసంగ్ ఎం02ఎస్, పోకో ఎం2, రెడ్మీ 9 ప్రైమ్, రియల్మీ నార్జో 20ఏ లాంటి మోడల్స్‌కు వివో వై12ఎస్ పోటీ ఇవ్వనుంది. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటా క్లిక్, వివో పార్ట్నర్ రీటైల్ స్టోర్స్‌లో వివో వై12ఎస్ కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.