• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • VIVO Y12S 2021 WITH SNAPDRAGON 439 SOC DUAL REAR CAMERAS LAUNCHED PRICE SPECIFICATIONS AND OTHER DETAILS SU GH

Vivo Y12s: వివో వై 12 ఎస్ అప్​గ్రేడ్​​ వెర్షన్​ లాంచ్.. ప్రాసెసర్​తో పాటు ఎన్నో మార్పులు.. ధర ఎంతంటే?

Vivo Y12s: వివో వై 12 ఎస్ అప్​గ్రేడ్​​ వెర్షన్​ లాంచ్.. ప్రాసెసర్​తో పాటు ఎన్నో మార్పులు.. ధర ఎంతంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వివో నుంచి గతేడాది విడుదలైన వివో వై 12 ఎస్​ను అప్‌గ్రేడ్‌ చేసి మరోసారి లాంచ్ ​చేసింది. ఈ కొత్త వేరియంట్​ ధర, ఇతర ఫీచర్ల వివరాలను పరిశీలిద్దాం..

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వివో నుంచి గతేడాది విడుదలైన వివో వై 12 ఎస్​ను అప్‌గ్రేడ్‌ చేసి మరోసారి లాంచ్ ​చేసింది. 2020 వెర్షన్‌లో అందించిన ఫీచర్లతో పాటు కొన్ని అప్​డేటెడ్​ ఫీచర్లను దీనిలో చేర్చింది. అయితే, వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్​ప్లే నాచ్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 20: 9 డిస్​ప్లే, 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లలో ఎటువంటి మార్పు చేయలేదు. కాగా, పాత వేరియంట్​​లో మీడియాటెక్ హెలియో పి 35 SoC ప్రాసెసర్​ను అందించగా.. కొత్త వేరియంట్​లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC ప్రాసెసర్​ను చేర్చింది. ఇక, కొత్త వేరియంట్​ ధర, ఇతర ఫీచర్ల వివరాలను పరిశీలిద్దాం.

వివో వై 12 ఎస్​ (2021) ధర..
వివో వై 12 ఎస్ అప్​డేటెడ్​ మోడల్​ సింగిల్ వేరియంట్​లో మాత్రమే లభిస్తుంది. దీనిలో 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్​ను అందించింది. దీని ధరను VND 3,290,000 (సుమారు10,500) గా నిర్ణయించింది. ప్రస్తుతం వియత్నాంలో విడుదలైన ఈ ఫోన్​ ఐ-బ్లూ, మిస్టీరియస్ బ్లాక్ కలర్స్​లో లభిస్తుంది. వియాత్నాం ఈ–కామర్స్ సైట్​ఎఫ్‌పిటి షాప్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే, ఈ ఫోన్​​ గ్లోబల్​ మార్కెట్​లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. కాగా 2020 నవంబర్‌లో వివో వై 12 వేరియంట్​ను గ్లోబల్​ మార్కెట్​లోకి ఆవిష్కరించారు. ఇది, ప్రస్తుతం రూ. 9,990 ధర వద్ద అందుబాటలో ఉంది.

స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, కొత్త వివో వై 12 ఎస్ (2021) మోడల్​ డ్యూయల్ సిమ్ (నానో) ఆండ్రాయిడ్ 11 ఓఎస్ 11తో పనిచేస్తుంది. దీనిలో 20: 9 కారక నిష్పత్తితో కూడిన 6.51-అంగుళాల హెచ్‌డి ప్లస్​ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC తో పాటు 3GB RAM తో పనిచేస్తుంది. దీనిలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్​ను కూడా చేర్చింది. ఈ సెటప్​లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్​లను అందించింది. కనెక్టివిటీ పరంగా చూస్తే.. 4 జి ఎల్‌టిఈ, వై-ఫై, బ్లూటూత్ వి 4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎఫ్‌ఎం రేడియో, మైక్రో-యుఎస్‌బి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటివి చేర్చింది. వీటితో పాటు యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లను చేర్చింది. బ్యాటరీ విషయానికొస్తే.. దీనిలో 10W ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది.
Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు