Vivo Y12G: తక్కువ బడ్జెట్‌లో వివో వై12జీ రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Vivo Y12G: తక్కువ బడ్జెట్‌లో వివో వై12జీ రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Vivo Y12G | రూ.10,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వివో నుంచి వివో వై12జీ మొబైల్ రిలీజ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    మీరు తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? వివో నుంచి తక్కువ బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. వివో వై12జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రూ.10,000 బడ్జెట్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేసుకొని వివో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. వివో వై12జీ స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్ + 32జీబీ వేరియంట్ ధర రూ.10,990. అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లో సేల్‌లో కొంటే రూ.10,000 ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే వివో నుంచి ఈ బడ్జెట్‌లో వివో వై12ఎస్ స్మార్ట్‌ఫోన్ ఉంది. ఇప్పుడు అదే బడ్జెట్‌లో వివో వై12జీ మోడల్‌ను పరిచయం చేసింది. జనవరిలో లాంఛ్ అయిన వివో వై12ఎస్ స్మార్ట్‌ఫోన్ లాగానే వివో వై12జీ మొబైల్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, డ్యూయెల్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వివో వై12జీ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్, పేటీఎం ప్లాట్‌ఫామ్స్, వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రీటైల్ స్టోర్లలో కొనొచ్చు.

    Realme Narzo 30: రియల్‌మీ నార్జో 30 కొత్త వేరియంట్ వచ్చేసింది... ధర ఎంతంటే

    Free Wi-fi: హైదరాబాద్‌లో 3000 ఫ్రీ వైఫై హాట్‌స్పాట్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్... 1జీబీ డేటా ఉచితం

    వివో వై12జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వివో వై12జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఏఐ పవర్ సేవింగ్ టెక్నాలజీ, వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0 వర్షన్, ఎఫ్ఎం రేడియో, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. యాక్సెలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మ్యాగ్నోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి.

    Lenovo Tab P11: ఆన్‌లైన్ క్లాసుల కోసం ట్యాబ్లెట్ కావాలా? లెనోవో ట్యాబ్ పీ11 సేల్ మొదలైంది... రూ.1,750 డిస్కౌంట్

    Mi 11 Lite: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,500 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

    వివో వై12జీ స్మార్ట్‌ఫోన్‌లో మల్టీ టర్బో 3.0 ఫీచర్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్లేసియర్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. వివో వై12జీ మొబైల్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రెడ్‌మీ 9 పవర్, సాంసంగ్ గెలాక్సీ ఎం12, పోకో ఎం2 లాంటి మోడల్స్‌కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published: